Tuesday, 29 September 2020

‘మోసగాళ్ళు’ స్కామ్‌ను బయటపెట్టనున్న అల్లు అర్జున్!

మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్ళు’. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం స్టైలిష్ స్టార్ సహాయం తీసుకుంటున్నారు విష్ణు. ఇంత‌కుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా.. దానికి అనూహ్యమైన స్పందన వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ప‌నిత‌నానికి స‌ర్వత్రా ప్రశంస‌లు ల‌భించాయి. ఇప్పుడు ‘మోస‌గాళ్ళు’ చేసిన స్కామ్ ఏ స్థాయిలో ఉందో బ‌య‌ట‌పెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబ‌ర్ 3న‌ ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్లడించ‌నున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను విల‌క్షణంగా, విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్రం రూపొందుతోంది. విష్ణు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం విశేషం. ఇంకా.. సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర, రుహీ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GeuBZL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....