హౌస్‌లో ఏమాత్రం కాస్త తేడాగా ఉన్నా మన బండారం మొత్తం బయటపడిపోయే ప్రమాదం ఉందంటున్నారు రెండో వారం ఎలిమినేట్ అయిన . బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కెమెరాలు ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటాయని.. వాటిని తప్పించుకోవడం మన తరం కాదంటున్నారు కరాటే కళ్యాణి. బిగ్ బాస్ హౌస్‌లో మనం ఏ మూలన ఉన్నా 10 కెమెరాలకు పైగా మనల్ని క్యాప్చర్ చేస్తాయని.. వాటిని తప్పించుకోలేం అంటున్నారు. కనీసం కనుసైగ చేసిన కెమెరాల్లో వచ్చేస్తుంది. బాత్ రూంలో కెమెరాలు పెట్టలేదు కాని.. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి మైక్ పెట్టారు. ఆ మైక్‌లో మనం ఏం మాట్లాడినా రికార్డ్ అయిపోద్ది. బాత్ రూంకి వెళ్లిని ఏదైనా మాట్లాడినా.. ఎవర్నైనా తిట్టినా.. పాటలు పాడినా అన్నీ రికార్డ్ అయిపోతాయి. బాత్ రూంలోకి వెళ్లేవరకూ కూడా ఒక కెమెరా క్యాప్చర్ చేస్తుంది. వెళ్లిన తరువాత బాత్ రూంలో ఉన్న స్పీకర్ యాక్టివ్ అవుతుంది. అక్కడ మనం ఏం చేసినా బండారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అక్కడ మనం ఏదైనా చేస్తే.. పడాల్సిన టైంలో పడుతుంది. ఇంత వరకూ బాత్ రూం మైక్‌లో మాట్లాడిన వాటిని బయటకు రివీల్ చేయలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం అంటే మాటలు కాదు.. మనం పడుకున్నా ఏం చేసినా అన్నీ రికార్డ్ అయిపోతాయి. అందుకే పడుకున్నప్పుడు కూడా అన్నీ సర్ధుకుని పడుకోవాల్సి వచ్చేది. నాకు నైటీలు, లూజ్‌గా ఉండే డ్రెస్‌లు వేసుకోవడం అలవాటు. కాని బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత నైటీలు వేసుకోవడం మానేశా.. ఎందుకంటే అక్కడ మనం ఎలాపడితే అలా పడుకుంటా.. ఆ టైంలో అటు ఇటు నైటీ పక్కకు జరిగినా నాకు లేనిపోని తలనొప్పి ఎందుకని నైటీలు మానేసి ట్రాక్‌లు వేసుకుని పడుకునేదాన్ని. అవి చాలా టైట్‌గా ఉండి నిద్రపట్టేది కాదు. చాలా ఇబ్బంది పడేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి. Read Also: Read Also:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S6Nlg0
No comments:
Post a Comment