యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తనని తాను రౌడీగా ఫీలయ్యే ఈ సెన్సేషనల్ స్టార్ అభిమానులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. రౌడీ బ్రాండ్‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదేంటో తెలుసా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్స్ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. Also Read: దక్షిణాది ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న తమ అభిమాన హీరోని చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. 2018, మార్చి 7న తన అకౌంట్‌ని ప్రారంభించారు. ఇంత తక్కువ వ్యవధిలోనే 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకోవడంతో ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ రికార్డుగా చెబుతున్నారు. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్‌తో చేసే క్రేజీ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితమే ప్రకటన వెలువడింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Gdosgw
No comments:
Post a Comment