అక్కినేని కోడలు అన్నంత పని చేసిందని పేర్కొంటూ ఆమె భర్త నాగచైతన్య సర్‌ప్రైజ్ చేశాడు. తన సతీమణి స్టార్ట్ చేసిన కొత్త ప్రయాణానికి సపోర్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మేరకు సమంత బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసి ఆకట్టుకున్నాడు. ఇంతకీ సమంత కొత్త జర్నీ ఏంటి? నాగచైతన్య సంతోషానికి కారణం ఏంటి? అనేగా మీ సందేహం. అదేనండీ.. ఇటీవలే సమంత ప్రకటించిన కొత్త బిజినెస్ మొదలైంది. పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునికతను క్యాష్ చేసుకునేలా వినూత్నంగా ఆలోచించిన సమంత ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ స్టార్ట్ చేసింది. 'సాకీ' పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజే (సెప్టెంబర్ 28) ఉదయం 9 గంటల 35 నిమిషాలకు తన సాకీ కలల ప్రపంచాన్ని జనం ముందుకు తెచ్చింది. ఇదే విషయాన్ని తెలుపుతూ సమంత భర్త తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. మరోవైపు చైతూ పోస్ట్ చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also Read: సినిమాలతో పాటు బయట కూడా ఫ్యాషన్ లుక్‌లో కనిపించడం, ఎప్పుడూ కొత్త గెటప్‌లో దర్శనమిస్తూ మోడ్రన్ దుస్తులు ధరించడం సమంతకు అలవాటే. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్న సామ్.. తాజాగా ఫ్యాషన్ రంగంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టడాన్ని స్వాగతిస్తున్నారు ఆమె అభిమానులు. ఇకపోతే తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమకు చిహ్నం ఈ 'సాకి వరల్డ్' అని అంటోంది అక్కినేని కోడలు సమంత. Also Read: ఇకపోతే పెళ్లి తర్వాత వరుస విజయాలతో సత్తా చాటుతున్న సమంత.. చిన్నపిల్లల కోసం 'ఏకం' ప్రీ స్కూల్ రెడీ చేసింది. అతిత్వరలో ఇది కూడా అందుబాటులోకి రానుంది. అమ్మడి స్టెప్స్ చూస్తుంటే బిజినెస్ రంగంలోనూ దూసుకుపోవడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3idmjyi
No comments:
Post a Comment