Sunday 27 September 2020

SP Balu: నా కొడుకు నూరేళ్లు చల్లగా ఉండాలి.. బాలు తల్లి ఎమోషనల్ వీడియో షేర్ చేసిన సునీత

బాలు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది సంగీత ప్రపంచం. ఏ పాట విన్నా.. గానగాంధర్వుడి ఆలాపనే ప్రతిధ్వనిస్తుండటంతో ఆయన స్మృతుల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు కోట్లాది మంది అభిమానులు. ఇక ఆయనతో కలిసి పాటలు పాడిన సింగర్ అయితే బాలు లేరన్న విషయాన్ని జీర్ణించుకోకపోతున్నారు. తాజాగా ఆయనతో కలిసి అనేక పాటలు ఆలపించి, బుల్లితెరపై స్వరాభిషేకం, ఝమ్మంది నాదం వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సునీత.. ఎస్పీ బాలుకి సంబంధించిన ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో తన తల్లిని గురించి అద్భుతంగా మాట్లాడారు.. అదే వీడియోలో బాలు తల్లి శంకుతలమ్మ తన కొడుకు గురించి అంతే గొప్పగా చెప్పారు. ఈ వీడియో బాలు మాట్లాడుతూ.. ‘నా తల్లి.. ఎప్పటికీ నాతోనే నా తల్లి.. ఇంతకు ముందు నేను స్వార్థంతో వందేళ్లు బతకాలని అన్నాను.. ఆ వందేళ్లు నేను బతికినప్పుడు నాతో పాటు నా తల్లి కూడా ఉండాలని నా కోరిక. ఆమె గొప్ప తల్లి.. నేను పాటలు ఆమె నుంచే నేను నేర్చుకున్నాను.. ఆమె నా జీవితంలో చాలా స్పెషల్’ అంటూ ఎమోషనల్‌గా చెప్పారు. ఇక బాలు తల్లి శంకుతలమ్మ మాట్లాడుతూ.. ‘వాళ్ల నాన్నగారు వీడు ఇంజనీర్ కావాలని అనుకునేవారు.. పాటలో పిచ్చిలో పడి అది వాడి వల్ల కాలేదు. పట్టిన పట్టు వదలడు బాలు.. ఏదైనా కావాలి అంటే ఇచ్చేయాలి.. ఏడేళ్ల వయసులో సైకిల్ అడిగాడు.. ఆ సైకిల్ తొక్కుతూ ఆడపిల్ల వేషాలు వేసేవాడు.. ఎక్కడ పాట వినిపించినా ఆగిపోతాడు.. మొదట్లో వాళ్ల నాన్న గారు తిట్టేవారు కాని.. గూడూరు కాళిదాసు నికేతన్‌లో పాటల్లో మొదటి ఫ్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి వరుసగా పాడుతూనే ఉండేవాడు.. కోదండపాణి గారు మొదటగా వీడితో పాట పాడించారు. అది మొదలుకొని పాడుతూనే ఉన్నాడు.. పైకి వచ్చాడు. నన్ను లక్షణంగా పోషిస్తున్నాడు.. నా ఆశీర్వాదం ఎప్పుడూ వాడికి ఉంటుంది.. లక్షణంగా నూరేళ్లు వాడు చల్లగా ఉండాలి’ అంటూ బాలు తల్లి ఆశీర్వదించారు. అయితే తన తల్లి మాటలకు భావోద్వేగానికి గురయ్యారు బాలు.. నేను ఎవర్నమ్మా పోషించడానికి?? నాకు జన్మనిచ్చింది ఆవిడ.. ఆమె బాగోగులు చూడటం నా కనీస కర్తవ్యం. మా అమ్మను నేను పోషించడం ఏంటి? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బాలు. సునీత షేర్ చేసి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఛిద్రమైన నా జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే’ అంటూ భావోద్వేగ సందేశాన్ని షేర్ చేశారు సునీత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30eyMLZ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz