Sunday 27 September 2020

Samantha: గరిటె తిప్పిన సమంత.. పక్కనే ఉండి పర్యవేక్షించిన ఉపాసన! వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో

కొణిదెల కోడలు ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా అక్కినేని వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించడానికి ఎలాంటి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? హెల్త్ విష‌యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియోతో ఆకట్టుకున్నారు ఈ స్టార్ కోడళ్ళు. ఈ వీడియోలో సమంత గరిటె తిప్పుడూ బ్రౌన్‌ రైస్ వండుతుండగా, ఆమె పక్కనే ఉండి ఉపాసన పర్యవేక్షిస్తోంది. సమంత, ఉపాసన ఇద్దరూ కలిసి బ్రౌన్ రైస్‌తో ట‌మాటో రైస్‌ను త‌యారు చేశారు. బ్రౌన్‌ రైస్‌తో టమాటో రైస్ ఎలా తయారు చేయాలో తాజా వీడియో ద్వారా చెప్పారు. బ్రౌన్ రైస్‌తో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలున్నాయని ఈ సందర్భంగా సమంత పేర్కొంది. తాను ప్రతిరోజు బ్రౌన్‌ రైస్‌ మాత్రమే తీసుకుంటానని చెప్పింది. ఇక ఈ వీడియోలో వీరిద్దరూ తమిళంలోనే మాట్లాడుతూ కనిపించడం విశేషం. ఉపాసన పర్యవేక్షణలో సమంత వంటకం చేస్తుండటం నెటిజన్లను ఆకరిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ప్రజలకు ఆరోగ్య సూత్రాలు అందిస్తూ కొణిదెల, అక్కినేని కోడళ్ళు ఒకే స్క్రీన్‌పై కనిపించడం చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మరోవైపు సమంత కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తోంది. పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇతర హీరోయిన్లకు పోటీగా అందాలతో మాయ చేస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36iaLay

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz