బిగ్ బాస్ హౌస్ రెండో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ పరిస్థితులు.. తాను ఎలిమినేషన్ అవడానికి కారణాలతో పాటు ఓటింగ్ విధానంపై అసహనం వ్యక్తం చేసింది కరాటే కళ్యాణి. ఇదే సందర్భంలో బిగ్ బాస్ షోపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టింది కరాటే కళ్యాణి. తొలి నుంచి , శ్రీరెడ్డి, శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్లు బిగ్ బాస్‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక మూడో సీజన్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. నిజంగానే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాలంటే లొంగాల్సిందేనా? ఛాన్స్ కావాలంటే ఆ పని చేయాల్సిందేనా?? బిగ్ బాస్‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో నిజం ఎంత?? అసలు అక్కడ ఏం జరుగుతుందన్ని విషయాలలపై వివరణ ఇచ్చారు కరాటే కళ్యాణి. బిగ్ బాస్ షోపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు కరాటే కళ్యాణి. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మాధవీలత, శ్వేతారెడ్డిలు గతంతో పాటు ఇప్పుడు కూడా బిగ్ బాస్‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు.. అక్కడ ఛాన్స్ కావాలంటే లొంగాల్సిందే అంటున్నారు? ఇది నిజమేనా అని యాంకర్ ప్రశ్నించడంతో సీరియస్ అయ్యింది కళ్యాణి. కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘వాళ్లు ఈ సీజన్‌కే కాదు.. వచ్చే ఐదో సీజన్‌కి తరువాత పది సీజన్లకు కూడా ఇలాంటి కామెంట్సే చేస్తారు.. ఎందుకంటే వాళ్లని బిగ్ బాస్ షోకి తీసుకోరు అందువల్లే. వాళ్లకి అలాంటి అనుభవం.. జరిగిందో లేదు మనకి తెలియదు. వాళ్లు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం. కాని బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు అలాంటిది ఉంది అంటే మాత్రం వాళ్లని చెప్పుతీసుకుని కొడతా. వీళ్లకు చేతనైతే బిగ్ బాస్ హౌస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నిరూపించమనండి. బిగ్ బాస్ షోపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ మీద రివ్యూలు చేస్తే డబ్బులు వస్తున్నాయి.. బురద చల్లితే కూడా డబ్బులు వస్తున్నాయని ఇలా చేస్తున్నారు. అన్నింటికీ ఇది వేదిక అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 1కి నేను సెలెక్టెడ్ కంటెస్టెంట్‌ని.. నాలుగో సీజన్‌కి వెళ్లాను. ఎవరో తెలియని 16 మంది కంటెస్టెంట్స్‌తో హౌస్‌కి వెళ్లాను. కరోనా వల్ల మొత్తం 20 మంది వరకూ క్వారంటైన్‌లో ఉంచారు. ఎవరికీ కూడా క్యాస్టింగ్ కౌచ్ లాంటివి లేవు. ఒక లేడీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు.. ఆ మేడమ్ మాతో ఇలాంటివి మాట్లాడతారా?? ఎందుకు మాట్లాడతారు? గతంలో బిగ్ బాస్‌పై ఆరోపణలు వచ్చాయి కనుక ఈసారి మహిళను ఇంటర్వ్యూ చేయడానికి పెట్టి ఉండొచ్చు. గతంలో వాళ్లు అడిగిన ప్రశ్న వీళ్లకు తేడాగా అనిపించి ఉండవచ్చు. వీళ్లు అర్థం చేసుకునే తీరు వేరుగా ఉండొచ్చు. లేదంటే అప్పుడు ఉంటే ఉండొచ్చు కాని.. సీజన్ 1కి, సీజన్ 4కి నన్ను బిగ్ బాస్‌కి రావాలని కోరారు తప్పితే కమిట్ మెంట్ ఇవ్వాలని మాత్రం అడగలేదు. నిజంగా అడిగి ఉంటే వెళ్లి మరీ వాయించేదాన్ని. నాకు అంత అవసరం లేదు.. నేను దానికి ఒప్పుకోను.. బిగ్ బాస్ షోకి వెళ్లి నా పరువును ఆ పని చేసి దిగజార్చుకోను. ఈ మాధవీలత అయితే.. అన్నింటిలోనూ వేలు పెట్టి మాట్లాడుతుంది. కాని అక్కడ జరిగేది వేరు.. ఈమె చెప్పేది వేరు. నిజంగా ఆమెను అడిగారేమో.. ఆమె వెళ్లదు కాబట్టి ఇలా చెప్పి ఉండొచ్చు. నేను బిగ్ బాస్‌కి వెళ్లాను.. కేర్ టేకర్‌గా కూడా మహిళలుగా ఉన్నారు. మా డ్రెస్‌లు కూడా మహిళలే ఇస్తున్నారు. ఒక్క మేనేజర్ తప్పితే మిగతా టీం అంతా మహిళలే ఉన్నారు. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే ఖచ్చితంగా ఖండిస్తా.. ఒకరిద్దరికి అనుభవం అయితే మొత్తం అందరికీ ఆపాదిస్తారా? అందరూ వెళ్లి అదే పని చేస్తున్నట్టా.. వెళ్లిన వాళ్లంతా వేస్ట్.. వీళ్లు ఒక్కరే మంచి వాళ్లు.. పుడింగులా?? వాళ్ల వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి. బిగ్ బాస్ షోకి వెళ్లిన నేను డైరెక్ట్‌గా చెప్తున్నా.. కేవలం వాళ్లు బిగ్ బాస్‌పై బురదచల్లి.. కాంట్రవర్శీ షోకి తీసుకుంటారనే ఇలా చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు కరాటే కళ్యాణి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i8GgX8
No comments:
Post a Comment