ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో సెన్సేషనల్ స్టార్ సినిమా చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సుకుమార్‌తో సినిమా చేస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ - విజయ్ దేవరకొండ నాలోని నటుడు అమితానందానికి గురవుతున్నాడు. నాలోని ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు! మీకు గుర్తుండిపోయే సినిమా ఇస్తామని హామీ ఇస్తున్నాం.. సుక్కు సార్‌తో కలిసి సెట్‌కి వెళ్లాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. కేదార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా స్నేహితుడివి, ఎంతో కష్టపడి పనిచేస్తావు’’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన కేదార్ భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నారట. అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌లతో చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కేదార్ మాట్లాడుతూ.. ‘‘ఈ పుట్టినరోజు నాకు చాలా స్పెషల్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్లతో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా 2022లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉండబోతుంది. ఈ కాంబినేషన్ అనగానే అందరికీ చాలా అంచనాలుంటాయి. విజయ్, సుకుమార్ ఇద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ల సినిమాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ల స్టైల్‌లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం’’ అని అన్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36gZVSj
No comments:
Post a Comment