ఆదివారం వచ్చేసింది.. నాగార్జున హంగామా ఆటలు పాటలు విషయాన్ని పక్కనపెడితే.. ఇదే రోజు హౌస్ నుంచి బ్యాగ్ సర్దించే కార్యక్రమం ఉండటంతో ఆసక్తినెలకొంది. శనివారం నాడు నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో మొనాల్, లాస్యలు సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. ఇక మిగిలిన ఐదుగురిలో యాంకర్ దేవి, మెహబూబ్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిలో ఎలిమినేషన్ అయ్యేదెవరన్న ఉత్కంఠతో ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ హైలైట్స్‌లోకి వెళ్తే.. సండే అంటే ఫన్ అంటూ ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున ఫన్ గేమ్‌తో మిస్టర్ మజ్ఞు పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ప్రతివారం నేను మాట్లాడటం కాదు.. ఈరోజు మీరు ఎంటర్ టైన్ చేయండంటూ ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. దీంతో అరియానా గ్లోరీ ‘బయటనే వైరల్ ఉంది.. ఇక్కడే సేఫ్‌గా ఉంది. సోదరా ఏంది బెస్ట్‌రా’ అంటూ పేరడీ సాంగ్ అందుకుంది. ఆ తరువాత కంటెస్టెంట్‌లతో చిత్ర విచిత్రమైన ఆటలు ఆడించారు నాగార్జున. మొదట అభిజిత్, రాజశేఖర్ మాస్టర్‌లతో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడించారు. ఇందులో రాజశేఖర్ మాస్టర్ 50 బెలూన్లను ఒక్క నిమిషంలో బ్లాస్ట్ చేశారు. ఆ తరువాత దేవి, లాస్యలు టవర్ గేమ్ ఆడారు. ఇందులో ఎవరూ టవర్‌ని బ్యాలెన్స్ చేయలేకపోవడంతో ఇద్దరూ కలిపి టవర్‌ని పెట్టే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఇక కుమార్, సొహైల్‌లు స్ట్రాల ఆట ఆడించారు. స్ట్రాలు ఎక్కువ ఎవరు పెట్టుకుంటే వాళ్లే విజేత అని ప్రకటించగా.. ఈ స్ట్రా గేమ్‌లో కుమార్ సాయి విన్నర్ అయ్యాడు. ఇక సాక్స్ గేమ్‌లో హారికపై సాక్షి దీక్షిత్ గెలిచింది. అఖిల్-మొహబూబ్‌లు మధ్య స్కిప్పింగ్ గేమ్ పెట్టగా.. మొహబూబ్ 100 స్కిప్ట్స్ చేయగా.. అందులో సగం కూడా చేయలేకపోయాడు అఖిల్. ఇక మిగిలిన వాళ్లకి బ్రెడ్, యాపిల్ ఈటింగ్ గేమ్స్ సరదాగా సరదాగా సాగాయి. ఇక కీలకమైన ఎలిమినేషన్స్‌లో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో లాస్య, మొనాల్‌లు సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక మరొకర్ని సేవ్ చేయడంతో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న మిగిలిన ఐదుగురికి ఐదు తాళాలు ఇచ్చి ఆ తాళంలో బాక్స్‌లు ఓపెన్ చేయాలని కోరారు నాగార్జున. అయితే మొదటగా.. యాంకర్ తాళానికి పెట్టె ఓపెన్ కావడంతో ఆమె సేవ్ అయినట్టు అనుకున్నారంతా.. అయితే తాళం ఓపెన్ అయితే సేవ్ అయినట్టు కాదని.. ఆ తాళానికి ఓపెన్ అయిన పెట్టిలో సేవ్ అయిన వాళ్ల పేరు ఉంటుందని ఆపేరు చదవాలని కోరారు నాగార్జున. దీంతో దేవి ఓపెన్ చేసిన పెట్టెలో మెహబూబ్ పేరు ఉండటంతో అతను సేవ్ అయ్యాడు. యాంకర్ దేవి చేతుల మీదుగా మెహబూబ్ సేవ్ అయ్యాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సీరియస్‌గా సాగుతున్న ఆటలో ఫన్ నింపేందుకు మరో ఫన్ డాన్స్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఒంటి కాళ్లతో డాన్స్.. తాగిన వాళ్లలా డాన్స్‌లు, నాగిని డాన్స్‌లు వేస్తూ రచ్చ చేసి తెగ నవ్వించారు. అయితే హారిక ప్రీజ్‌లో ఉంచి ఆమెను డిస్ట్రబ్ చేసే మగాడే లేడా? అని అభిజిత్‌ని రెచ్చగొట్టారు నాగ్. నువ్ వెళ్లి ట్రై చేయి అభి అనగానే.. ప్రీజ్‌లో ఉన్న హారిక.. అభి పేరుచెప్పగానే తెగ నవ్వేసి కనెక్ట్ అయిపోయింది. వెంటనే అభిజిత్ వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అదేంటి?? అభి పేరు చెప్పగానే అలా అయిపోయావ్ అని నాగార్జున అనగానే తెగ సిగ్గు పడిపోయింది హారిక. అనంతరం నామినేషన్స్‌లో ఉన్న హారికను సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. (అప్డేట్స్ కొనసాగుతాయి)
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33Yc384
No comments:
Post a Comment