ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరు. ఆమె గజ్జెల సవ్వడితో ఇల్లంతా ఆనందదాయకం అవుతుంది. పున్నామ నరకం నుంచి కాపాడేవాడు కొడుకు అని చెప్పే పెద్దలు.. ఇంటికి వెలుగునిచ్చేది ఆడపిల్లనే అంటుంటారు. అందుకే ఓ కొడుకు, కూతురు ఉన్న ఇల్లు సంపూర్ణం అని భావిస్తుంటారంతా. ఈ విషయంలో మెగా బ్రదర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కొడుకు వరుణ్ తేజ్, కూతురు తండ్రిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మెగా బ్రదర్. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 27) సందర్భంగా కూతుళ్లపై తనదైన స్టైల్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు నాగబాబు. తన కూతురు నిహారికతో ఫన్నీ మూమెంట్ షేర్ చేస్తూ డాటర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు.. ''కూతుళ్లంటే.. మనం కలలు కనే చిట్టి దెయ్యాలే. వాళ్ళే కూతుళ్ల రూపంలో ఈ భూమ్మీదకు వస్తారు. మనల్ని నవ్వించేందుకు, ఏడిపించేందుకు, ఆట పట్టించేందుకు, చిరాకు తెప్పించేందుకు.. మొత్తానికి మనల్ని ప్రేమలో పడేసేందుకు మన కోసం మన ఇంటికి వస్తారు. హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్'' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. 'ప్రతీ దెయ్యానికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు' అంటూ మెగా బ్రదర్ వే లోనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. Also Read: మెగా బ్రదర్‌కి తన కూతురు నిహారిక అంటే పంచ ప్రాణాలు అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆ పంచ ప్రాణాలను దెయ్యం అంటూ ముద్దుగా ఆయన సంబోధించడం మెగా అభిమానులను అట్రాక్ట్ చేసింది. తన కూతురు నిహారిక పట్ల ప్రేమను ఎన్నో ఇంటర్వ్యూల్లో వ్యక్తం చేశారు నాగబాబు. ఇకపోతే మెగా డాటర్ నిహారిక పెళ్లికి రెడీ అయింది. ఇటీవలే గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఆ రోజు నుంచి నిహారిక పెళ్లి మ్యాటర్, కాబోయే భర్త చైతన్యతో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని సమాచారం. చూడాలి మరి నాగబాబు దెయ్యం నిహారిక అత్తారింటికిపోతే ఆయన ఎంత బెంగ పెట్టుకుంటారో!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/342wocn
No comments:
Post a Comment