సినీ నిర్మాత నట్టి కుమార్ కుమారుడు, కుమార్తెలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నట్టి క్రాంతి, క్విటీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నట్టి లక్ష్మి కరుణ సినీ హక్కుల విషయంలో తనను మోసం చేశారంటూ ఫ్రెండ్లీ మూవీస్ యజమాని అడ్డాల చంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు కథనం ప్రకారం.. సీనియర్ నటుడు నరేస్ తనయుడు నవీన్ విజయ కృష్ణ, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాకు సంబంధించి ప్రసార, శాటిలైట్, డిజిటల్ హక్కులు అడ్డాల చంటి వద్ద ఉన్నాయి. Also Read: ఆ హక్కులను తమకు విక్రయించాలని నట్టి క్రాంతి, నట్టి లక్ష్మీకరుణ కొంతకాలం క్రితం చంటిని సంప్రదించారు. ఇందుకోసం రూ.45 లక్షలు మూడు వాయిదాల్లో చెల్లిస్తామని ఒప్పందం చేసుకుని మూడు చెక్కులిచ్చారు. అయితే చెక్కుల్లో ఉన్న అమౌంట్‌లో తేడా ఉండటంతో మరో మూడు చెక్కులు ఇస్తామని నమ్మించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చంటి ఆ సినిమా హక్కుల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు.
వారిద్దరిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో సైతం చంటి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే నట్టి క్రాంతి, నట్టి లక్ష్మి కరుణ తామే నిర్మాతలుగా ఆ సినిమా పోస్టర్లు తయారు చేయించి సోషల్ మీడియాలోనూ విడుదల చేశారు. దీంతో షాకైన చంటి బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నట్టి క్రాంతి, నట్టి లక్ష్మి కరుణపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jkccsO
No comments:
Post a Comment