Saturday, 12 September 2020

ఫేస్‌ని అందంగా మార్చే యాంటీ ఏజింగ్ లోషన్ ఇంట్లోనే చేసుకోండిలా..

వయసు, జీవన శైలి ప్రభావాల దృష్ట్యా చర్మం మీద ముడతలు, చారలు కనిపిస్తూ కొంచం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అధికంగా కెమికల్ ఉత్పత్తుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. కానీ, కెమికల్ ఉత్పత్తులు తాత్కాలిక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఆ ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయన్న గ్యారెంటీ లేదు. కావున ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్ధాలతోనే తయారు చేసుకుని ఉపయోగించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. యాంటీ ఏజింగ్ లోషన్ తయారీ విధానం : కావలసిన పదార్ధాలు :
  • అలోవేరా జెల్ 3 స్పూన్లు
  • విటమిన్ ఈ కాప్సూల్స్ 3
  • రోజ్ వాటర్ 2 స్పూన్లు
  • గ్లిజరిన్ ఒక స్పూన్.
  • ఎసెన్షియల్ ఆయిల్ 4 చుక్కలు.
ఇక్కడ అలోవేరా జెల్ లో విటమిన్ ఎ, సి తోపాటు యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి డ్రైస్కిన్, మొటిమల సమస్యతో బాధపడేవారికి ఉత్తమంగా సహాయం చేస్తాయి. విటమిన్ ఈ కాప్సూల్స్ చర్మాన్ని ఎండ ప్రభావం నుండి సంరక్షించడమే కాకుండా, చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచేలా చూస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా, చర్మం మీద ఆయిల్ (జిడ్డు), మురికిని తొలగించి హైడ్రేట్ గా ఉంచి పిహెచ్ వాల్యూని పునరుద్దరిస్తుంది. ఇక గ్లిజరిన్ ముడతలు, ఫైన్ లైన్స్ తొలగించడంలో సహాయం చేస్తుంది. తయారీ విధానం.. ఇప్పుడు పదార్దాలన్నింటినీ ఒక బౌల్లో తీసుకుని జెల్ లా వచ్చేలా కలపండి. ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ జెల్ ను ఒక కంటైనర్లోనికి తీసుకోండి. దీనిని రూమ్ టెంపరేచర్లో 2 నుండి 3 రోజుల వరకు ఉంచవచ్చు. ముఖాన్ని శుభ్రపరచిన తర్వాత, ఈ యాంటీ ఏజింగ్ లోషన్ ను ముఖానికి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ముఖం మీద కింద నుండి పైకి మసాజ్ చేసినట్లుగా అనుసరించండి. నుదురుతోపాటుగా ముడతలుగా కనిపించిన ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇంట్లోనే తయారు చేయగలిగే ఈ యాంటీ ఏజింగ్ లోషన్, అన్నిరకాల చర్మాలకు సరిపోతుంది. ముడతలు లేని నిగారింపు కూడిన చర్మాన్ని అందివ్వడంలో మీకు సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం తరచూ అనుసరించండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2RlIWpa

No comments:

Post a Comment

The PT Teacher Behind Two WPL Stars

'Today when I see them talking to people from different countries confidently, I realise that education does not come from classrooms al...