బుల్లితెర భారీ పాపులారిటీ షో ఎంతలా ఫేమస్ అయ్యిందో అంతే కాంట్రవర్సీల్లోనూ నిలిచింది. ఒక్క తెలుగులోనే గాక అన్ని భాషల్లో బిగ్ బాస్‌పై ఎన్నో విమర్శలు రావడం చూశాం. బిగ్ బాస్ మేనేజ్‌మెంట్‌పై లైంగిక ఆరోపణలు మొదలుకొని కంటిస్టెంట్స్ మధ్య గొడవలు, ఓవర్ యాక్షన్ వరకు ఎన్నో విషయాలు వివాదం సృష్టించాయి. కాకపోతే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, మరెన్ని విమర్శలొచ్చినా అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ మాత్రం సక్సెస్‌ఫుల్ గానే రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్‌పై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది . లైంగిక వేధింపులపై ఉద్యమించి ప్రస్తుతం హాయిగా రిలాక్స్ అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న శ్రీ రెడ్డి.. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో కాసేపు టచ్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సీజన్ 4 నడుస్తున్న క్రమంలో ఆమెను బిగ్ బాస్‌పై మీ ఒపీనియన్ ఏంటని అడిగాడు ఓ నెటిజన్. దానిపై రియాక్ట్ అయిన శ్రీ రెడ్డి.. తాను బిగ్ బాస్ అంటే నచ్చదని, ఆ షో అస్సలు చూడనని, అందులో పార్టిసిపెంట్స్ దొంగ ఏడుపులు చూడడం తన వల్లకాదంటూ ఓపెన్ అయింది. Also Read: బిగ్ బాస్ అంతా ఫేక్ ఎమోషన్స్ అంటూ సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి.. తనకే గనక బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వాళ్ళందరి అసలు రంగు బయటపెడుతూ వారి నిజ స్వరూపాలను మీ ముందుంచేదాన్నని చెప్పింది. ఇప్పటిలా ఫేక్ ఎమోషన్స్ కాకుండా రియల్ ఎమోషన్స్‌ను అందరికీ చూపించేదాన్ని అని శ్రీ రెడ్డి పేర్కొంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 4 ఆశించిన మేర ఆకట్టుకోవడం లేదనే వాదనలు ప్రేక్షకుల నుండి వినిపిస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33lOnu7
No comments:
Post a Comment