Monday 7 September 2020

నెయిల్ పాలిష్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా..

ప్రస్తుత సమయం కొంచెం క్రియేటివ్ గా ఆలోచించేందుకు సపోర్ట్ చేస్తోంది. సెల్ఫ్ కేర్ కూడా అందులో ముఖ్యమే. నేచురల్ వేస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హోమ్ బేస్డ్ రెమెడీస్ నే ప్రయత్నించడం అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా బ్యూటీ రొటీన్ లో కూడా నేచురల్ ప్రాసెస్ ను ఫాలో అవడం మంచిదే. నిజానికి హెయిర్ అలాగే స్కిన్ కేర్ విషయంలో నేచురల్ మెథడ్స్ ఫాలో ఐతే వచ్చే రిజల్ట్స్ గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మనం ఓ సరికొత్త డిఐవై గురించి తెలుసుకుందాం. నెయిల్ పెయింట్ ను ఇంట్లోనే తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. బయటికి వెళ్లి కెమికల్స్ తో నిండిన కొనే బదులు ఇంట్లోనే ఒకటి తయారుచేసేసుకోండి. నిజానికిది ఎంతో సింపుల్. మరి ప్రాసెస్ లోకి వెళ్లిపోదామా...! 1. నేచురల్ నెయిల్ పెయింట్ కావలసిన పదార్థాలు
  • బెల్లం - 50 గ్రాములు
  • మెహందీ లేదా హెన్నా పౌడర్ - 1 టీస్పూన్
  • లవంగాలు - 20 గ్రాములు
ప్రాసెస్: బెల్లాన్ని పౌడర్ లా మార్చేవరకు గ్రైండ్ చేయండి. ఆ తరువాత ఒక బౌల్ లోకి బెల్లం పౌడర్ ను తీసుకోండి. మధ్యలో కాస్తంత ఖాళీను క్రియేట్ చేసి అందులో లవంగాలను పెట్టండి. ఇప్పుడు ఇంకొక బవుల్ ను వీటిపైన ఉంచి వీటిని గ్యాస్ స్టవ్ పై పెట్టండి. వేడి ఎక్కనివ్వండి. దాదాపు 10 నిమిషాల్లో ఆవిరి రావడాన్ని గమనిస్తారు. ఆ తరువాత ఇది వాటరీగా మారుతుంది. ఇప్పుడు ఈ వాటరీ మిక్స్ కు కాస్తంత హెన్నా పౌడర్ ను కలపండి. దీన్ని నెయిల్స్ కు కోటింగ్ గా అప్లై చేయవచ్చు. కాస్తంత చల్లారాక నెయిల్ కోట్ గా ఈ మిశ్రమాన్ని వాడండి. కాటన్ బాల్ ను ఉపయోగించి నెయిల్ కోట్ అప్లై చేసుకోవచ్చు. ఇది గోర్లపై చాలా కాలం ఉంటుంది. ఈ నేచురల్ నెయిల్ పెయింట్ బెనిఫిట్స్ ఏంటి? నెయిల్ పాలిషెస్ అనేవి కొన్ని రోజుల తరువాత పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతాయి. నెయిల్స్ పై అనీవెన్ గా ఉంటాయి. ఈ నేచురల్ నెయిల్ పెయింట్ కనీసం రెండు వారాల పాటు ఉంటుంది. దానంతటదే పోతుంది. చాలాసార్లు నెయిల్ పాలిష్ లో ఉండే కెమికల్ కంపొషిషన్స్ వల్ల స్కిన్ యొక్క నేచురల్ కలర్ దెబ్బతింటుందని. బెల్లం, లవంగాలు అలాగే హెన్నా వంటివి నెయిల్స్ ను ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి నెయిల్స్ ను హెల్తీగా ఉంచుతాయి. హెన్నాను నెయిల్స్ పై అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు? హెయిర్ ని కలర్ చేసుకోవడానికి హెన్నాని ఎక్కువగా వాడతారు. ఇది నెయిల్స్ కు కూడా మంచిదే. మరోవైపు, ఇది నెయిల్స్ ను దృఢపరిచి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. 1. హెన్నాను వాటర్ తో కలిపి పేస్ట్ లా తయారుచేసి నెయిల్స్ పై అప్లై చేసి అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత ఎండిపోయిన హెన్నాను రిమూవ్ చేయాలి. గోర్లు బలహీనంగా, చిట్లినట్టుగా ఉంటే హెన్నా అనేది మంచి రెమెడీ. నెయిల్స్ పై హెన్నాను అప్లై చేసి అలాగే ఉంచితే నెయిల్స్ స్ట్రాంగ్ గా అలాగే హెల్తీగా మారతాయి. ఇందులో కేరాటిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి, నెయిల్స్ డేమేజ్ అవకుండా ఈ పదార్థం కాపాడుతుంది. 2. నెయిల్స్ ను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల నెయిల్స్ డేమేజ్ అవుతాయి. క్యూటికల్స్ లోపలికి బాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తుంది. దాంతో, నెయిల్స్ సహజ రంగును కోల్పోతాయి. మాటిమాటికీ క్రాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి, హెన్నా అనేది మంచి రెమెడీ. ఇది బాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను అరికట్టేందుకు హెల్ప్ చేస్తుంది. 3. హెన్నా అనేది నేచురల్ ప్రోడక్ట్. కాబట్టి ఇది నెయిల్స్ కు ఎటువంటి డేమేజ్ కలిగించదు. పైగా హెన్నా వల్ల నెయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెయిల్ పాలిష్ కంటే ఎక్కువ కాలం నెయిల్స్ పై మన్నుతుంది. అంటే, నెయిల్ కేర్ కోసం మీరు తక్కువ సమయాన్ని కేటాయిస్తే చాలు నెయిల్ హెల్తీగా అలాగే కాంతివంతంగా మారతాయి. నేచురల్ హెన్నా డై అనేది పురాతన కాలం నుంచి ఆచరణలో ఉన్న బ్యూటీ సీక్రెట్. ఇండియాతో పాటు మిడిల్ ఈస్ట్ కు చెందిన మహిళలు దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. హెన్నాతో నెయిల్ పెయింట్ గురించి తెలుసుకుంటే మీరు నెయిల్ పాలిష్ లపై ఖర్చు చేసే మొత్తాన్ని తగ్గించుకోగలరు. 2. నేచురల్ నెయిల్ పెయింట్ కావలసిన పదార్థాలు:
  • నేచురల్ హెన్నా పౌడర్
  • నిమ్మరసం
  • ఆపిల్ సైడర్ వినేగార్
స్టెప్ 1: హెన్నా పేస్ట్ ను కలపండి: ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ ను చిన్న బవుల్ లోకి తీసుకోండి. అందులోకి కాస్తంత నిమ్మరసాన్ని పిండండి. పేస్ట్ లా తయారుచేయండి. పొటాటోస్ ను మ్యాష్ చేస్తే వచ్చే కన్సిస్టెన్సీలా ఈ పేస్ట్ తయారవ్వాలి. ఈ బవుల్ ను ప్లాస్టిక్ వ్రాప్ తో కవర్ చేయండి. ఫ్రిడ్జ్ లో ఆరు నుంచి పన్నెండు గంటలపాటు అలాగే ఉంచండి. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. ఈ మిశ్రమం డార్కర్ షేడ్ లోకి వచ్చిందంటే పేస్ట్ రెడీ అయిందని అర్థం. స్టెప్ 2: నెయిల్స్ మరియు క్యూటికల్స్ ను ప్రిపేర్ చేసుకోండి: నెయిల్స్ ను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి. క్యూటికల్స్ ను జెంటిల్ గా వెనక్కి పుష్ చేయండి. నెయిల్స్ ను వాష్ చేయండి. ఆపిల్ సైడర్ వినేగార్ లో ముంచిన కాటన్ బాల్ తో వైప్ చేసి నెయిల్స్ పై ఉన్న ఆయిల్ లేదా డర్ట్ ను రిమూవ్ చేయండి. స్టెప్ 3: హెన్నా పేస్ట్ ను అప్లై చేయండి: నెయిల్ బ్రష్ ను ఉపయోగించి నెయిల్ పై ఈ హెన్నా పేస్ట్ ను అప్లై చేయండి. వివిధ లేయర్స్ అప్లై చేస్తే మంచిది. స్టెప్ 4: వెయిట్ చేయండి: ఈ పేస్ట్ 30 నిమిషాల పాటు డ్రై అవ్వాలి. డార్కర్ కలర్ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువసేపు ఈ పేస్ట్ ఆరాలి. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. స్టెప్ 5: మేకోవర్ ను రివీల్ చేయండి: హెన్నా పేస్ట్ ను రిమూవ్ చేయడానికి నిమ్మరసంలో లేదా ఆపిల్ సైడర్ వినేగార్ లో ముంచిన కాటన్ బాల్ ను వాడాలి. సో ఈ నేచురల్ నెయిల్ పెయింట్స్ నెయిల్ హెల్త్ ను ఎంతో ఇంప్రూవ్ చేస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/33bSlFk

No comments:

Post a Comment

'I'm Being Used As A Potato For 25 Years'

'...be it a comedy, thriller or a love story.' from rediff Top Interviews https://ift.tt/5orx1p9