Monday 7 September 2020

థియేటర్స్ మూత వెనుక భారీ కుట్ర.. చిరంజీవి, బాలకృష్ణ పేర్లు తీస్తూ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. వైరస్ విజృంభణకు బ్రేకులేయడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కార్మికులకు శాపంగా మారింది. పని దొరకక పొట్ట చేతపట్టుకొని రోజు వారి కార్మికులు బిక్కుబిక్కుమన్నారు. అయితే అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా క్రమంగా పలు రంగాలకు వెసులుబాటు ఇస్తూ వస్తున్న గవర్నమెంట్ థియేటర్స్ ఓపెన్ విషయంలో ఇంకా షరతులను సడలించలేదు. దీంతో థియేటర్స్‌లో పనిచేసే కార్మికులు ఇప్పటికీ ఆర్ధిక కష్టాలతో పస్తులుంటూ పూట వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై నిర్మాత, ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ నట్టికుమార్ స్పందిస్తూ తన అసంతృత్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 7 తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన నట్టి కుమార్.. థియేటర్స్ రీ ఓపెన్, తన తదుపరి సినిమాల విషయాలపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల సినిమా హాల్స్ దెబ్బతింటున్నాయని, కొన్ని థియేటర్స్‌లో ఫర్నీచర్ నాశనం అవుతుండగా.. ఇంకొన్ని థియేటర్స్‌లో ఫర్నీచర్ చోరీకి గురైన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. అంతటితో ఆగక థియేటర్స్ తెరుచుకోకపోవడం వెనుక పెద్ద లాబీయింగ్ జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత కారణంగా వేల సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారని, వారంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. Also Read: రైళ్లు, విమానాలకు లేని నిబంధనలు థియేటర్లకే ఎందుకు అంటూ ఫైర్ అయిన నట్టికుమార్.. థియేటర్స్ మూసివేసి ఓటీటీ వేదికగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. పెద్ద హీరోలందిర‌కీ ఈ రోజు కోట్ల మార్కెట్ ఉందంటే అది కేవ‌లం థియేట‌ర్ల వ‌ల్ల‌నే అనే విషయం మరవకూడదని అన్నారు. ఇలా అయితే ఇక థియేట‌ర్లు మూసివేయాలా..? దీనికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు టాలీవుడ్ పెద్దలైన , నాగార్జున‌, బాల‌కృష్ణలు కూడా స‌మాధానం చెప్పాలంటూ సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత నట్టి కుమార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FbV6OT

No comments:

Post a Comment

'I'm Being Used As A Potato For 25 Years'

'...be it a comedy, thriller or a love story.' from rediff Top Interviews https://ift.tt/5orx1p9