Tuesday, 18 August 2020

ఇంట్లోనే దొరికేవాటితోనే మీ తెల్లజుట్టుని నల్లగా మార్చుకోండిలా..

ఒకప్పుడు వయసుతో మాత్రమే తెల్లజుట్టు వచ్చేది. ఇప్పుడు ఉన్న టెన్షన్స్ కీ, పొల్యూషన్ కీ ముప్ఫై రాకముందే హెయిర్ కి కలర్ వేయడం మంచిదా, కొన్నాళ్ళు హెన్నాతో గడపడం మంచిదా అని ఆలోచించేవారు ఎక్కువైపోతున్నారు. బాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఈ సమస్య రాదని అందరూ చెప్తూనే ఉంటారు. కానీ, అన్ని సార్లూ అలా ఫాలో అవ్వడం కుదరకపోవచ్చు కూడా. కానీ, ఈ సమస్యనే పర్టిక్యులర్ గా టార్గెట్ చేసే కొన్ని చిట్కాలున్నాయి. ఈ చిట్కాలకి కావలసిన దినుసులన్నీ కూడా మీ వంటింట్లోనే ఉంటాయి. అవేమిటో చూసేద్దామా మరి. 1. బ్లాక్ టీ ఒక కప్పు నీళ్ళు మరగబెట్టి అందులో రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించండి. ఈ మిశ్రమం చల్లారాక మీ జుట్టుకి పట్టించి ఒక గంట ఆరనివ్వండి. ఆ తరువ చన్నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా రెండు వారాలకి ఒకసారి చేయవచ్చు. బ్లాక్ టీ మీ హెయిర్ కి బ్లాక్ కలర్ ని ఇస్తుంది. అలాగే, డల్ హెయిర్ ని రివైవ్ చేస్తుంది. 2. నిమ్మకాయ, కొబ్బరి నూనె.. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలపండి. దీన్ని స్కాల్ప్ నుండి జుట్టు చివరల వరకూ నెమ్మదిగా పట్టించండి. అలా ముప్ఫై నిమిషాలు వదిలేయండి. సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. దీని వల్ల ఆల్రడీ తెల్లబడిన జుట్టు నల్లగా మారదు కానీ, కొత్త తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది. 3. కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేయండి. పాన్ అడుగున నల్లగా ఏర్పడేవరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత స్కాల్ప్ నుండీ జుట్టు చివర వరకూ నెమ్మదిగా పట్టించండి. ఒక గంట తరువాత సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. కరివేపాకు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ని రిస్టోర్ చేస్తుంది. దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది కూడా. 4. బంగాళా దుంప తొక్కలు.. ఆరు బంగాళా దుంపల నుండి తొక్క తీయండి. ఆ తొక్కల్ని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించండి. ఆ నీరు గంజి లాగా అయ్యేవరకూ మరిగించండి. చల్లారిన తరువాత ఆ నీటిని వడగట్టి తొక్కలు తీసేసి లిక్విడ్ ని ఒక మగ్ లోకి తీసుకోండి. హెయిర్ వాష్ చేసి, కండిషన్ చేసిన తరువాత ఈ లిక్విడ్ ని తల మీద పోయండి. జాగ్రత్తగా జుట్టంతా తడిసేటట్లు పోయండి. ఇంకా తరువాత తల మీద నీరు పోయకండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు. ఈ మిశ్రమం జుట్టుకి పిగ్మెంటేషన్ ని ఇస్తుంది. ఈ పని చేయడం కూడా చాలా సులువు. 5. బ్లాక్ కాఫీ బాగా స్ట్రాంగ్ గా కాచిన కాఫీ డికాషన్ చల్లారిన తరువాత ఒక మగ్ లోకి తీసుకోండి. ఈ కాఫీ ని జుట్టంతా తడిసేటట్లుగా పోయండి. ఇరవై నిమిషాలు ఆగిన తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కానీ రెగ్యులర్ యూజ్ వల్ల జుట్టు డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. 6. కొబ్బరి నూనె, ఉసిరి పొడి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేసి వేడి చేయండి. ఈ పొడి నల్లబడే వరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత ఈ నూనె తో జుట్టు కుదుళ్ళ నుండీ చివరల వరకూ మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేయండి. ఒక గంట అలా వదిలేయండి. లేదా రాత్రంతా కూడా అలాగే ఉంచేయవచ్చు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికిల్స్ దగ్గర ఉండే మెలనిన్ ని ప్రిజర్వ్ చేస్తుంది. దీని వల్ల గ్రేయింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. 7. మిరియాలు ఒక కప్పు పెరుగులో రెండు గ్రాముల నల్ల మిరియాలు వేసి బ్లెండ్ చేయండి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నించీ చివరల వరకూ పట్టించండి. ఈ పని చేస్తున్నప్పుడు ఆ చేత్తో కళ్ళు నలుపుకోకండి, కళ్ళు మండుతాయి. ఒక గంట వదిలేసిన తరువాత సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లబడడమే కాక జుట్టు సాఫ్ట్ గా అవుతుంది కూడా. 8. మెంతులు ఒక పాన్ లో అరకప్పు కొబ్బరి నూనె వేసి మరిగించండి. అందులో పావు కప్పు మెంతులు వేసి ఇంకొక ఏడెనిమిది నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. మెంతులు తీసేసి ఆ ఆయిల్ ని ఒక జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకుని జుట్టుకి పట్టించండి. రాత్రంతా అలా వదిలేసి పొద్దున్న సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. 9. ఆయిల్స్.. ఇందుకోసం మీరు జొజోబా ఆయిల్, ఆలివ్ ఆయిల్, బ్లాక్ సీడ్ ఆయిల్ లో ఏదైనా ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఆయిల్ ని రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకుని కొద్దిగా వెచ్చబెట్టండి. ఈ గోరు వెచ్చని నూనె తో పదిహేను నిమిషాల పాటూ స్కాల్ప్ అంతా మసాజ్ చేయండి. ఆ తరువాత జుట్టు చివరల వరకూ పట్టించండి. ఇప్పుడు వేడి నీటిలో ముంచి పిండిన టవల్ తో హెయిర్ కవర్ చేసుకోండి. ఇలా ముప్ఫై నిమిషాలు ఉంచండి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. 10. ఆనియన్ జ్యూస్.. ఒక ఉల్లిపాయ నించి జ్యూస్ తీసి ఒక బౌల్ లో వేయండి. ఈ జ్యూస్ ని స్కాల్ప్ అంతా మసాజ్ చేసి అరగంట వదిలేయండి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు కుదుళ్ళ నించీ కూడా నల్లబడుతుంది.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Q35Kte

No comments:

Post a Comment

'Investments Of Over Rs 4 Trn To Create 100,000 Jobs'

'The size of the investments is important, but equally crucial is the number of jobs that these proposals create.' from rediff Top...