Friday, 21 August 2020

జుట్టు చివర్లు చిట్లి పోతున్నాయా.. ఇలా చేయండి..

స్ప్లిట్ ఎండ్స్ ఎలా వస్తాయంటే... ఒకప్పుడు జలపాతం లా ఉరికే మీ జుట్టు ఇప్పుడు నిర్జీవం గా కళ లేకుండా కనిపిస్తోందా? జుట్టులో తేమ లేకుండా అయిపోతోందా? అయితే, మీ జుట్టు చివర్లో చిట్లిపోతోందని అర్ధం. పొల్యూషన్ వల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కానీ, అది ఒక్కటే కారణం కాదు. హెయిర్‌ని ట్రీట్ చేస్తున్న పద్ధతిని బట్టి కూడా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న రీజన్స్ లో మీరు రిలేట్ అయ్యేదేదైనా ఉందేమో చెక్ చేసుకోండి. 1. జుట్టు బాగా పొడి గా ఉన్నప్పుడు చిక్కు తీయడం 2. జుట్టు బాగా తడి గా ఉన్నప్పుడు చిక్కు తీయడం 3. హెయిర్ కవర్ చేసుకోకుండా ఎండలోకి వెళ్ళటం 4. హెయిర్ స్టైలింగ్ టూల్స్ ని ఎక్కువగా వాడడం 5. హెయిర్ రెగ్యులర్ గా ట్రిం చేసుకోకపోవడం 6. హెయిర్ రెగ్యులర్ గా కండిషన్ చేయకపోవడం 7. రోజూ హెయిర్ వాష్ చేయడం 8. హెయిర్ ని కెమికల్ ట్రీట్మెంట్ కి గురి చేయడం 9. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడడం 10. అన్ హెల్ది డైట్ తీసుకోవడం స్ప్లిట్ ఎండ్స్ ని ఎందుకు ట్రిమ్ చేయాలి? స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేయకుండా ఉండడం మంచిది కాదు. ఎందుకో చూడండి. 1. స్ప్లిట్ ఎండ్స్ వాటంతటవే మాయమైపోవు. స్ప్లిట్ ఎండ్స్ ని రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోతే అవి ఫెదర్స్ గా స్ప్లిట్ అవుతాయి. ఇది హెయిర్ గ్రోత్ ని అడ్డుకుంటుంది. 2. స్ప్లిట్ ఎండ్స్ ఒక కలర్ లో, మామూలు హెయిర్ ఒక కలర్ లో ఉంటాయి. సో, కేర్ తీసుకోకపోతే హెయిర్ కలర్ అన్ ఈవెన్ గా కనపడుతుంది. 3. జుట్టు కి సహజం గా ఉండే గ్లో స్ప్లిట్ ఎండ్స్ వల్ల పోతుంది. ఎన్ని హెయిర్ మాస్క్స్, ఎంత కండిషనింగ్ కూడా ఈ గ్లో ని వెనక్కి తీసుకురాలేదు, మీరు స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేస్తే తప్ప. ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ ని ఎలా ట్రిమ్ చేయాలో చూద్దాం. స్ప్లిట్ ఎండ్స్ ని ఇంట్లోనే మూడు రకాల పద్ధతుల్లో ట్రిమ్ చేయవచ్చు. దీనికి మీకు కావలసిందల్లా హెయిర్ ట్రిమ్మింగ్ సిజర్స్, దువ్వెన, అంతే. ఇప్పుడు ఒక్కో మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. 1. హెయిర్ ట్విస్టింగ్ మెథడ్ హెయిర్ ట్రిమ్మింగ్ మెథడ్స్ ఇది ట్రెడిషనల్ మెథడ్. దీన్నే ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. జుట్టు పొడిగా ఉన్నప్పుడే ఇది చేయాలి. 1. ముందుగా ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకుని కుదుళ్ళ నించి చివరి వరకూ క్లాక్ వైజ్ గా ట్విస్ట్ చేయండి. 2. ఈ ట్విస్ట్ చేసిన సెక్షన్ ని లాగి పట్టుకోండి. 3. ఇప్పుడు ఈ ట్విస్ట్ పొడుగూతా మీకు స్ప్లిట్ ఎండ్స్ బైటికి కనిపిస్తూ ఉంటాయి. 4. పైనించి కింద వరకూ ఇలా స్టిక్ ఔట్ అయిన స్ప్లిట్ ఎండ్స్ ని ట్రిమ్ చేసుకుంటూ రండి. 5. ఇప్పుడు ఇదే సెక్షన్ ని యాంటీ క్లాక్ వైజ్ గా రీ-ట్విస్ట్ చేయండి. 6. ఇప్పుడు కూడా కొన్ని స్ప్లిట్ ఎండ్స్ బయటకి కనిపిస్తాయి. వాటిని ట్రిమ్ చేసేయండి. 7. ఇలా హెయిర్ మొత్తం చేయండి. హెయిర్ స్లైడింగ్ మెథడ్ ఈ మెథడ్ చాలా మందికి తెలియదు. కొద్దిగా అన్ కన్వెన్షనల్ మెథడ్ కూడా. మీది స్ట్రైట్ హెయిర్ కాకపోతే ఈ మెథడ్ లో ముందు హెయిర్ ని స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసే ముందు హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేశాక స్ట్రైట్ చేయడం మర్చిపోకండి. 1. ముందుగా వెడల్పాటి పళ్ళున్న దువ్వెన్న తో జుట్టు జాగ్రత్తగా చిక్కు తీయండి. 2. ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకోండి. ఈ హెయిర్ మీ చూపుడు వేలు కిందుగా, మధ్య వేలు పైకి, మళ్ళీ ఉంగరం వేలు కిందగా వచ్చేట్లుగా పట్టుకోండి. అంటే, మీ మధ్య వేలు పైనే జుట్టు కనబడుతూ ఉంటుంది. 3. ఇప్పుడు మీ మధ్య వైలు పైన మీకు కనిపిస్తున్న స్ప్లిట్ ఎండ్స్ ని సిజర్స్ తో ట్రిమ్ చేసేయండి. 4. ఇలా జుట్టు చివరి వరకూ చేయండి. 5. ఇలా హెయిర్ మొత్తం చేయండి. ఎండ్స్ ని ట్రిమ్ చేయడం ఇంత టైం ప్రతి సారీ ఉండక పోవచ్చు. అలాంటప్పుడు ఎండ్స్ ని ట్రిమ్ చేసేయండి. తలస్నానం చేసి రాగానే, జుట్టు ఇంకా తడిగా ఉన్నప్పుడే ఇది చేయాలి. లేదంటే, స్ప్రే బాటిల్ సహాయం తో జుట్టు ని తడిపి అప్పుడు చేయండి. 1. ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకోండి. 2. ఈ హెయిర్ ని మీ చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో పట్టుకోండి. 3. అలా వేళ్ళు కిందకి తీసుకొచ్చి ఒక ఇంచ్ పైగా గట్టిగా పట్టుకోండి. 4. ఇప్పుడు జాగ్రత్తగా ఒకటి రెండు అంగుళాల హెయిర్ ని సిజర్స్ తో కట్ చేసేయండి. 5. హెయిర్ మొత్తం ఇలా చేసేయండి. స్ప్లిట్ ఎండ్స్ ని ట్రిమ్ చేయడం ఈజీనే అయినా అవి జుట్టు ఆరోగ్యంగా లేదన్న విషయాన్ని సూచిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా చూడచ్చు. 1. హెయిర్ వాష్ కి ముందు కంపల్సరీగా ఆయిల్ అప్లై చేయండి. 2. బ్లో డ్రయ్యర్స్, ఫ్లాట్ ఐరన్స్ లాంటి స్టైలింగ్ టూల్స్ ని వీలున్నంత తక్కువగా యూజ్ చేయండి. ఒకవేళ వాడవలసి వస్తే ముందు హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేయండి. 3. ప్రతి రోజూ హెయిర్ వాష్ చేయకండి. 4. మరీ వేడి నీళ్ళు వాడకండి. 5. జుట్టు ని సహజం గా ఆరనివ్వండి. 6. లీవ్-ఇన్ కండిషనర్ ని అప్లై చేయండి. 7. వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో నే చిక్కు తీసుకోండి. జుట్టు చివరల నించి చిక్కు తీసుకుంటూ పైకి వెళ్ళండి. 8. బయటకి వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ కానీ, హ్యాట్ కానీ వాడండి. 9. రెండు వారాలకి ఒకసారి డీప్ కండిషన్ చేయండి 10. సాఫ్ట్ గా ఉండే హెయిర్ బాండ్స్ వాడండి. 11. బాలెన్స్డ్ డైట్ తీసుకోండి. 12. ప్రతి రెండు మూడు నెలలకీ ఒక సారి హెయిర్ ట్రిమ్ చేయండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/32deSRP

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8