Saturday, 24 October 2020

లిప్ బామ్, లిప్ సీరమ్ మధ్య తేడా ఏమిటీ? ఎలా తయారు చేసుకోవాలి?

లికాలం కూల్ కూల్‌గా భలే బావుంటుంది కానీ, చర్మానికి మాత్రం ఈ కాలం అస్సలు మంచిది కాదు. చర్మ సౌందర్యంపై శ్రద్ధ పెట్టేవారు ఈపాటికే వింటర్ ఎస్సెన్షియల్స్ తెచ్చేసుకుని ఉంటారు. అయితే, ఈ కాలం చర్మానికి మాత్రమే కాదు, పేదాలకు కూడా మంచిది కాదు. ఈ కాలంలో పెదవులు పొడిబారిపోతాయి. పగులుతూ ఉంటాయి. దీంతో చాలామంది రాసేస్తుంటారు. అయితే, ఆ బామ్ ఎంతో సేపు పనిచేయదు. అందుకే, మీ వద్ద లిప్ బామ్‌తోపాటు కూడా దగ్గర ఉంచుకోండి. ఇంతకీ లిప్ బామ్‌కు, లిప్ సిరమ్‌కు తేడా ఏమిటీ? లిప్ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలి? లిప్ బామ్: 1. ముఖం మీద చర్మంతో పోల్చితే పెదవుల మీద స్కిన్ పలచగా ఉంటుంది. అందుకని లిప్స్ డ్రై అయిపోకుండా లిప్ బామ్ రక్షిస్తుంది. 2. లిప్ బామ్ వాడడం వల్ల లిప్స్ యూత్‌ఫుల్‌గా కనపడతాయి. 3. ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ సన్‌ రేస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. లిప్ సీరమ్: లిప్ బామ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. సీరం మీ లిప్ సమస్యలను టార్గెట్ చేస్తే బామ్ మాయిశ్చర్‌ను లాక్ చేస్తుంది. లిప్స్ లోపల సెబేకియస్ గ్లాండ్స్ అసలు ఉండవు. దీనివల్ల లోపల నుంచి ఎలాంటి నేచురల్ ఆయిల్స్ ఉత్పత్తి కావు. దీని వల్ల పెదాలు త్వరగా పొడిబారిపోతాయి. లిప్ బామ్స్ మాయిశ్చరైజ్ చేస్తాయి. కానీ, అవి కూడా వెంటనే డ్రై అయిపోతాయి. మాటి మాటికీ వాటిని పెదాలకు అప్లై చేస్తుండాలి. లిప్ సీరమ్స్ అలా కాదు, అవి లాంగ్ టెర్మ్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఎందుకంటే, లిప్ బామ్ పైపైనే ప్రొటెక్షన్ ఇస్తుంది. లిప్ సీరమ్ లోపలి నుంచి సమస్యను పరిష్కరిస్తుంది. అంతేగాక సీరమ్స్ ఫైన్ లైన్స్‌‌ను తగ్గిస్తాయి. Read Also: లిప్ సీరమ్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. హోమ్ మేడ్ లిప్ సీరమ్ తయారీ: ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి రోల్-ఆన్-నాజిల్ ఉన్న ఒక చిన్న బాటిల్‌లో వేయండి. రాత్రి నిద్రకి ముందు ఈ సీరమ్ అప్లై చేయండి. పొద్దున్న ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా మీకు కావాలనుకుంటే అప్లై చేయవచ్చు. కానీ, ఇది చాలా థిక్‌గా ఉంటుంది. ఇందులోని పసుపు లిప్స్‌ను మళ్ళీ సరైన రంగులోకి లోకి తెచ్చేస్తాయి. నెయ్యి చలి కాలంలో కావాల్సిన పోషణ అందిస్తుంది. లిప్స్ స్క్రబ్ చేసుకున్న వెంటనే ఈ సీరమ్ అప్లై చేయడం ఇంకా మంచిది. Read Also: ఈ జాగ్రత్తలు పాటించండి: 1. లిప్ స్క్రబ్ తరువాత లిప్ సీరమ్ అప్లై చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోయి లిప్ సీరమ్ ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతుంది. 2. హోమ్ మేడ్ లిప్ సీరమ్ కడిగి ఆరబెట్టిన క్లీన్ కంటెయినర్ లోనే స్టోర్ చేసుకోవాలి. 3. ప్రిసైజ్ అప్లికేషన్ కోసం లిప్ బ్రష్ యూజ్ చేయవచ్చు. 4. సీరమ్ అప్లై చేసిన తరువాత బామ్ అప్లై చేయడం మర్చిపోకండి. 5. ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాయి. 6. ఈ సీరమ్ ని కొద్ది కొద్దిగానే తయారు చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3jn0q0d

No comments:

Post a Comment

'Determination Not To Bend Before Aurangzeb'

'...despite all his horses, elephants, tanks and swords.' from rediff Top Interviews https://ift.tt/34xEhrA