Sunday 20 February 2022

Online Ticketing: ‘భీమ్లా నాయక్’ ఆన్ లైన్ బుకింగ్‌..నైజాం డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ డిసిషన్.. ప్రేక్ష‌కుడు ప‌రిస్థితేంటి!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా న‌టించారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే యు.ఎస్‌లో ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయోన‌ని ఫ్యాన్స్‌, సినీ గోయర్స్ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. అయితే నైజాంలో ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ కావ‌డం లేదు. ఈ విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ ఆన్ లైన్ టికెటింగ్ ఎందుకు వ‌ద్ద‌నుకున్నార‌నే దానికి అస‌లు కార‌ణం.. బుక్ మై షో స‌హా ప‌లు ఆన్ లైన్ టికెటింగ్ సెంటర్స్ ద్వారా సినిమా టికెట్‌ను బుక్ చేసుకున్న‌ప్పుడు స‌ర్వీస్ ఛార్జ్‌ను వేసున్నారు. దీంతో పాటు జి.ఎస్‌.టి ఇత‌ర‌త్ర ట్యాక్స్ క‌లిపి టికెట్‌పై దాదాపు పాతిక రూపాయ‌లు ఎక్స్‌ట్రా డ‌బ్బులు అవుతున్నాయ‌ట‌. సామాన్యుడిపై భారం త‌గ్గించాలంటే ఈ స‌ర్వీస్ ఛార్జ్‌ను తీసేయాల‌ని నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్.. బుక్ మై షో వారిని కోరడం.. వారు ఒప్పుకోక‌పోవ‌డంతో, భీమ్లా నాయ‌క్‌కి ఆన్ లైన్ టికెటింగ్‌ను నైజాంలో వ‌ద్ద‌ని అనుకున్నారు. ముందుగా టికెట్ తీసుకోవాల‌నుకున్న ప్రేక్షకులు నేరుగా టికెట్ కౌంట‌ర్‌నే సంప్ర‌దించాల‌ని నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందుల‌నే ఎదుర్కొంటుంది. ఈ క్ర‌మంలో సామాన్యుడిపై ఆన్ లైన్ టికెటింగ్ సిస్ట‌మ్ ద్వారా మ‌రింత భారం పెరిగింది. దీన్ని త‌గ్గించే దిశ‌గానే నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. భీమ్లా నాయ‌క్ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ వంశీ నిర్మించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లేతో పాటు పాట కూడా రాయ‌డం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gtxQ4AU

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc