Friday, 18 February 2022

Amitabh Bachchan : ‘ప్రాజెక్ట్ K’తో క‌ల నిజ‌మైంది : ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ఫ్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘’. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీనియ‌ర్ నిర్మాత చ‌ల‌సాని అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’ సినిమా స‌క్సెస్‌తో ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి.. ‘మ‌హాన‌టి’ వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీని రూపొందించి ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీని త‌న వైపు చూసేలా చేసుకున్న ద‌ర్శ‌క‌కుడు నాగ్ అశ్విన్‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. కొన్ని రోజులుగా ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో ఆయ‌న చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప్ర‌భాస్‌ల‌పై కాంబినేష‌న్ సీన్‌ను చిత్రీక‌రించారు. దీనిపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌భాస్ స్పందిస్తూ ‘‘నా కల నిజమైంది. లెజెండ్రీ గారితో ఈరోజు నా తొలి స‌న్నివేశాన్ని పూర్తి చేశాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. పాన్ ఇండియా మూవీగా కాకుండా ఈ చిత్రాన్ని పాన్ వ‌రల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ తెలిపారు. సై ఫై మూవీగా ‘ప్రాజెక్ట్ K’ తెర‌కెక్కుతోంద‌ని టాక్ సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. క్రేజీ కాంబినేష‌న్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ‘బాహుబ‌లి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ మార్చి 11న ‘రాధే శ్యామ్’తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. మరో వైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆది పురుష్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ‘సలార్’ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నారు మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OnbQhms

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...