Wednesday 9 February 2022

అవ‌మానాలు కూడా మంచే చేస్తాయి... మ‌హేష్‌తో విల‌న్‌గా అయినా చేస్తాను : హీరో సుధీర్ బాబు

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు హీరో . ఈయ‌న త‌న కెరీర్‌ను ప్రారంభించి ప‌దేళ్లు అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయ‌న కొన్ని ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ‘‘మా ఇంట్లో మా ఆవిడే నా బెస్ట్ క్రికెట్‌. ఈ ప‌దేళ్ల జ‌ర్నీ చాలా హ్య‌పీ. విజ‌యాలు చూశాను. ప‌రాజ‌యాలు చూశాను. ఫెయిల్యూర్స్ వ‌చ్చిన‌ప్పుడు పాఠాలు నేర్చుకున్నాను. హీరోగా నేను జ‌ర్నీ స్టార్ట్ చేసిన తొలి రోజునే చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్నాను. ఓ కెమెరామెన్ న‌న్ను చూసి ఇత‌ను ఫొటో జెనిక్ ఫేస్ కాదు. నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మే అన్నాడు. ఆ మాట విన‌గానే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. అయితే బాగా న‌టించి నిరూపించాల‌ని నిర్ణ‌యించుకుని అడుగు ముందుకు వేశాను. ఇప్ప‌టికీ జ‌ర్నీ కొన‌సాగుతూనే ఉంది. అలాంటి అవ‌మానాలు కూడా మ‌న‌కు మంచే చేస్తాయి. గోపీచంద్ బ‌యోపిక్‌తో పాటు మ‌రో నాలుగు సినిమ‌లు ఒప్పుకున్నాను’’ అని అన్నారు హీరో సుధీర్ బాబు. ‘సూపర్ స్టార్ మహేష్ సినిమాలో విలన్‌గా చేయ‌మంటే చేస్తారా?’ అని ప్ర‌శ్నిస్తే.. ‘‘క‌చ్చితంగా చేస్తాను. త‌న‌తో క‌లిసి న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. అయితే ఇద్ద‌రికీ స‌రిపోయే క‌థ దొర‌కాలి. అలాగే నేను నిర్మాత‌గా నా బ్యాన‌ర్‌లో మ‌హేష్‌తో ఓ సినిమా చేయాల‌ని ఉంది’’ అంటూ సుధీర్ బాబు మ‌హేష్ గురించిన విష‌యాల‌ను, కెరీర్‌లో త‌ను ఎదుర్కొన్న అవ‌మానాల‌ను వివ‌రించారు. ఈ క్ర‌మంలో సుధీర్ బాబు ఓ ఆసక్తిక‌ర‌మైన విష‌యం చెప్పారు. అదేంటంటే.. ఇది వ‌ర‌కు ఈయ‌న బాలీవుడ్‌లో రూపొందిన‌ భాఘి చిత్రంలో విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ హీరో హీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న బ్ర‌హ్మాస్త్ర చిత్రంలో మెయిన్ విల‌న్‌గా న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అయితే అప్పుడు స‌మ్మోహ‌నం సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పిన కార‌ణంగా చేయ‌లేన‌ని చెప్పేసిన‌ట్లు చెప్పారు సుధీర్ బాబు. అలా ఓ పాన్ ఇండియా మూవీని సుధీర్ బాబు రిజెక్ట్ చేశారు మ‌రి. ప్రస్తుతం ఈయన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/eEKqN6o

No comments:

Post a Comment

'How Can A 16 Year Old Be A BJP Agent?'

'I went to jail and met my father to convince him to join politics and believe in the Constitution.' from rediff Top Interviews ht...