Friday, 25 February 2022

Pawan Kalyan : ఏడోసారి ఆ మైల్ స్టోన్ ట‌చ్ చేసిన‌ ప‌వ‌ర్ స్టార్‌.. ‘భీమ్లా నాయ‌క్’ స్ట్రోమ్ మామూలుగా లేదు!

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇక యు.ఎస్ విష‌యానికి వ‌స్తే.. ఫిబ్ర‌వ‌రి 24నే ‘భీమ్లా నాయ‌క్’ ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. అక్క‌డ ప్రీమియ‌ర్ షోస్ వ‌సూళ్లు 867000 డాల‌ర్స్‌గా ట‌చ్ అయ్యింది. శుక్ర‌వారానికి ఇది వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను ట‌చ్ చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇలా ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిన సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఏడోది. సినిమాకు స‌క్సెస్ టాక్ రావ‌డంతో ఇక సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందో చూడాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్ర‌దేశ్‌లో టికెట్ రేట్స్ త‌క్కువ‌గా ఉన్నాయి. తెలంగాణ త‌ర‌హాలో అక్క‌డ మంచి టికెట్ రేట్స్ ఉండుంటే.. సినిమా వ‌సూళ్ల ప‌రంగా మ‌రింతగా దూసుకెళ్ల‌ద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌. తెలుగు రాష్ట్రాలు స‌హా మొత్తం తొలి రోజు ‘భీమ్లా నాయ‌క్’ వ‌సూళ్లు ఏంతో తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగితే పూర్తి వివ‌రాలు వ‌చ్చేస్తాయి. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్నితెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌కుడు. స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు నెటివిటీకి స‌రిపోయేలా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను, పాత్ర‌ల‌ను మ‌లిచారు. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9u8SG1e

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...