చాలా కాలం తర్వాత నటించిన కొత్త సినిమా ''. దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు, రాజకీయాల గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రావాలనే ఆసక్తి లేదని మోహన్ బాబు చెప్పారు. ఈ జన్మకు రాజకీయాలు వద్దనుకుంటున్నానని అన్నారు. ''ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గార్లు నాకు బంధువులు కాబట్టి వారి తరఫున నా బాధ్యతగా గతంలో ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నేను సినిమాలు, శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ పనులతో చాలా బిజీగా ఉన్నాను. ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు బంధువులు, స్నేహితులున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో పదేళ్లకుపైగా అనుబంధం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణగారి అబ్బాయి పెళ్లిలో నాని, నేను కలిశాం. బ్రేక్‌ఫాస్ట్‌కి తనని ఇంటికి ఆహ్వానించాను.. వచ్చారు. ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామే తప్ప మా మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కానీ, సీఎం జగన్‌గారితో జరిగిన భేటీపై కానీ ఎలాంటి చర్చ జరగలేదు'' అని చెప్పారు మోహన్ బాబు. ఇకపోతే 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/odqawmD
No comments:
Post a Comment