Saturday, 26 February 2022

Radhe Shyam : డార్లింగ్ ప్రభాస్ కోసం రాజమౌళి ..‘రాధే శ్యామ్‌’కు జక్కన్న సాయం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంద‌రూ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఇప్ప‌టికే ఉన్న క్రేజ్ చాలద‌న్న‌ట్లు ఇంకా హైప్‌ను ఒక్కో స్టెప్ పెంచుతూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ సినిమా నెరేష‌న్‌కు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇప్పుడు ఇదే నెరేష‌న్‌ను తెలుగు వెర్ష‌న్‌కు ఎవ‌రు ఇస్తార‌నే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌లేదు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ‘రాధే శ్యామ్‌’ తెలుగు వెర్షన్ నెరేషన్‌కు రాజ‌మౌళి త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. రీసెంట్‌గానే రాజ‌మౌళికి సంబంధించిన వ‌ర్క్‌ను ‘రాధే శ్యామ్‌’ యూనిట్ పూర్తి చేసిందని టాక్‌. పూర్తి స్థాయి ప్ర‌మోష‌న్స్‌ను మార్చి మొద‌టి వారం నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచనాల‌ను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. అదే స‌మ‌యంలో ఈ సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్ర‌భాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘రాధే శ్యామ్‌’ ఒక‌టి. క‌రోనా కార‌ణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వ‌చ్చి, ఇప్ప‌టికీ రిలీజ్ అవుతుంది. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ క‌థా చిత్ర‌మిది. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రికా నిపుణుడిగా క‌నిపిస్తే.. పూజా హెగ్డే మ్యూజిక్ టీజ‌ర్ ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ కూడా ఈ చిత్రంలో న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8EiSdPB

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...