Thursday, 10 February 2022

DJ Tillu Pre Release Event : ఆ సినిమా తరువాత పని అవ్వలేదు.. సిద్దు జొన్నలగడ్డ కామెంట్స్

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డిజె టిల్లు చిత్రాన్ని దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించాడు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 12న థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 10)న మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో హీరో మాట్లాడుతూ.. ‘నా టీంలో పని చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పను. ఎలాగూ ఒకరికొకరం థ్యాంక్స్‌ఫుల్‌గా ఉంటాం. మా హీరోయిన్ ఇక్కడకు రాలేకపోయింది. కొన్ని పర్సనల్ కారణాలతోనే ఇక్కడకు రాలేకపోయింది. కానీ ఈ ఈవెంట్‌ను ఆమె చూస్తుంటుంది. ఆమె ఎనర్జీని ఇక్కడ మిస్ అవుతున్నాం. వారం రోజుల నుంచి కొత్త కొత్త పదాలు వింటున్నాను. బుకింగ్స్ అంటున్నారు.. ప్రీ రిలీజ్ బిజినెస్ అంటున్నారు.. సోల్డ్ అవుట్ అంటున్నారు.. బ్రేక్ ఈవెన్ అంటున్నారు.. వంశీ గారు ఫోన్ చేసి యూఎస్‌లో 80కే, 100కే అన్నారు. ఏంటన్నా అని అడిగితే.. ఇవేమో నీకు తెలీదు.. ఫోన్ పెట్టేసేయ్ అని అన్నారు. గుంటూరు టాకీస్ తరువాత పని అవ్వలేదు..పని అయ్యే వరకు బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను.. మళ్లీ ఇప్పుడు థియేటర్లోకి రాబోతోన్నాను.. నా చుట్టూ ఏదో నడుస్తోంది.. బజ్ ఉంది.. మీరంతా కూడా ఫిబ్రవరి 12న థియేటర్లకు వస్తరు.. చూస్తరు. మీ అందరినీ నవ్విస్తాను.. స్పీచ్ ఏం రాసుకోలేదు. అలా వచ్చి మాట్లాడుతున్నా. నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీ అయినా సితారలో సినిమా చేశాను. మా నిర్మాతకు కొంచెం కోపం ఎక్కువ. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. చినబాబు గారితోకలిసి పని చేశాం. త్రివిక్రమ్ గారితోనూ పని చేశాం. నెక్ట్స్ నా సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డిలిటెడ్ వీడియో ఇలా అన్నింటికి శ్రీచూ (శ్రీచరణ్ పాకాల)తోనే చేయిస్తాను. సినిమాకు తమన్ అద్బుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టారు. పెద్ద హీరోకు కొట్టినట్టు కొట్టాడు. ఫిబ్రవరి 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tgar6OP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....