Friday, 11 February 2022

Jr NTR : ఎన్టీఆర్ సత్తా ఏంటో నాకు తెలుసు.. ఆనాడే చెప్పా.. పాయల్ కామెంట్స్ వైరల్

యంగ్ టైగర్ నటన, డ్యాన్సులకు వంక పెట్టడానికి అవకాశం దొరకదు. ఇప్పుడు ఎన్టీఆర్ స్టామినాను ఇండియా మొత్తం చూడబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ నేషనల్ వైడ్‌గా రికార్డులు క్రియేట్ చేయబోతోన్నాడు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఎన్టీఆర్ గురించి బాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి. ఇక ఎన్టీఆర్‌తో నటించాలని, కలిసి డ్యాన్సులు చేయాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లే కోరుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో అలియా భట్, వంటి తారలున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ అలియా భట్ కాంబో ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీపక తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ మీద కామెంట్ చేసింది. గెహ్రాయాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా దీపక తెలుగు హీరోల మీద కామెంట్ చేసింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించింది. ఎన్టీఆర్ ఆద్భుతమైన వ్యక్తి, ఆయన అద్భుతంగా నటిస్తాడు.. కలిసి నటించాలని అనుకుంటున్నాను అని దీపిక చెప్పుకొచ్చింది. ఇక ఈ కామెంట్ల మీద స్పందించింది. ఓ రెండేళ్ల క్రితం మీరా చోప్రా ఎన్టీఆర్ తెలియదంటూ చేసిన కామెంట్లపై పాయల్ ఘోష్ ఎలా మండిపడిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మీద దీపిక చేసిన కామెంట్లపై పాయల్ ఘోష్ సంతోషించినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్, మంచి మనిషి..అంతకు మించి ఆల్ రౌండర్ స్టార్.. ఇవన్నీ నేను ఎప్పుడో చెప్పాను.. కానీ నన్ను అందరూ విమర్శించారు.. నెగెటివ్‌గా మాట్లాడారు.. కానీ మొదటి నుంచి ఆయన సత్తా గురించి అదే చెబుతూ వచ్చాను.. ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తోంది.. నేను చెప్పింది ఎప్పుడూ తప్పు కాలేదంటూ పాయల్ ట్వీట్ వేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/4iJsUe5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....