
లైంగిక వేధింపులు.. ఉద్యోగం చేస్తున్న మహిళలు వారున్న ఆఫీసుల్లో, పరిసరాల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇది. తోటి ఉద్యోగులు, పై అధికారులు మహిళలను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ మీ టూ అనే పెద్ద ఉద్యమమే నడిచింది. ఇందులో సినీ పరిశ్రమ కూడా భాగమైన తర్వాత చాలా మంది మహిళలు సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న సమస్యలను బయట పెట్టారు. ఇలా గుట్టుగా ఉంటూ వచ్చిన సమస్యలు బయట పడటంతో ఒక్కసారి సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్నీ రంగాల్లోనూ ఉంది. కానీ మీడియా కారణమో, మరేదైనా కారణమో ఏమో కానీ.. సినీ పరిశ్రమపైనే ఫోకస్ ఎక్కువైంది. పలువురు నటీమణులు, హీరోయిన్స్ అందరూ సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న సమస్యలపై నోరు విప్పారు. అలాంటి సమయంలో టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ‘‘టాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయడం అనే సంస్కృతిని తెలుగు సినిమాలో నేనూ చూశాను. చాలా మంది మహిళలు కాస్టింగ్ కౌచ్ సమస్యతో బాధపడుతున్నవారే. అయితే నేను నిజాయతీగా, నిక్కచ్చిగా మాట్లాడటంతో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు ఎదురు కాలేదు. సినిమా పరిశ్రమలోనే కాదు. అన్నిచోట్ల మహిళలకు ఇలాంటి ఇబ్బందులున్నాయి’’ అని తెలియజేసింది జేజెమ్మ. ఈ విషయాన్ని ఆమె రెండేళ్లు ముందు నిశ్శబ్దం సినిమా విడుదల సమయంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులను సూపర్ సినిమాతో పలకరించిన అనుష్క శెట్టి తనదైన గుర్తింపును సంపాదించుకుంది. అరుంధతి చిత్రంతో టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. భాగమతి సినిమా కూడా ఆమెకు మరింత పేరుని తెచ్చి పెట్టింది. 2020లో నిశ్శబ్దం తర్వాత దాదాపు ఈమె రెండేళ్లు సినిమాలేవీ చేయలేదు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేయబోతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/y2tL5Mg
No comments:
Post a Comment