Saturday, 19 February 2022

విజయ్ దేవరకొండ చాలా పిరికివాడు.. హీరోయిన్ అలా అనేసిందేంటి బాబోయ్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌తో కలిసి 'లైగర్' సినిమా చేస్తున్న ఈ హీరోయిన్ ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా 'గెహ్రయాన్' రూపంలో హిట్ అందుకున్న అనన్య పాండే.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండపై ఇలాంటి కామెంట్స్ వదలడం హాట్ టాపిక్ అయింది. తెరపై కనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటారని, అంతేకాదు.. అతడు సహజంగా పిరికివాడు అని కూడా అనేసింది అనన్య. ఆయనతో నటించడం చాలా సరదాగా ఉంటుందని, ఓ నటిగా తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చిన వ్యక్తి విజయ్ అని ఆమె పేర్కొంది. ఆయన నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా చూశానని, ఆ మూవీ చాలా నచ్చిందని చెప్పిన అనన్య.. సినిమాలోని ఆ క్యారెక్టర్‌కి, విజయ్ దేవరకొండ రియల్ క్యారెక్టర్‌కి అసలు పొంతనే ఉండదని ఆమె చెప్పడం గమనార్హం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అన్ని హంగులతో 'లైగర్' సినిమా రూపొందుతోంది. ముంబై బ్యాక్ డ్రాప్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ- అనన్య పాండే కెమిస్ట్రీ హైలైట్ కానుందట. చిత్రంలో బాక్సర్‌గా, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబో అయ్యేసరికి సినీ వర్గాల్లో ఓ రకమైన క్రేజ్ నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన 'లైగర్' అప్‌డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ముఖ్యపాత్రలో కనిపించనుండటం మరో విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/jFfweH0

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...