Monday, 21 February 2022

భీమ్లా నాయక్ ట్రైలర్‌పై ఆర్జీవీ టాక్.. PK ఫ్యాన్ అంటూనే వేసేశాడు బాగా వేసేశాడు!!

అదేంటో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా తనదైన కోణంలో విమర్శనాత్మక బాణాలు విసురుతున్నారు . మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత అంతటి పేరు తెచ్చుకునే సత్తా ఒక్క అల్లు అర్జున్‌కి తప్పితే ఆ కాంపౌండ్‌లోనే ఇంకెవ్వరికీ లేదంటూ నేరుగా చెప్పేసి దీన్ని హాట్ ఇష్యూ చేసిన ఆర్జీవీ.. తాజాగా విడుదలైన '' ట్రైలర్ చూసి తన రివ్యూ చెప్పేశారు. PK ఫ్యాన్ అంటూనే అనాల్సినవన్నీ అనేశారు వర్మ. వరుస ట్వీట్స్ పెట్టి పవన్ అభిమానులను మళ్ళీ కెలికారు. మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా ఈ 'భీమ్లా నాయక్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, రానా భాగమయ్యారు. భీమ్లా నాయక్‌గా నటించగా.. డానియ‌ల్ శేఖర్‌గా దగ్గుబాటి రానా కనిపించబోతున్నారు. అయితే మాతృకలో లాగా ఇద్దరు హీరోల పేర్లు టైటిల్‌గా తీసుకోకుండా ఒక్క పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ మాత్రమే టైటిల్‌గా ఎంచుకోవడంపై గతంలోనే రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' ట్రైలర్ రిలీజ్ అయ్యాక అదే పాయింట్ ఫోకస్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరి రోల్స్ బాగా ఎలివేట్ చేస్తూ పూనకాలు తెప్పించారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఉంది సీన్. అయితే ఇందులో లాజిక్ తీస్తూ పవన్‌ని బాగానే వేసుకున్నారు వర్మ. ట్రైలర్ చూశాక ఈ మూవీ టైటిల్ ‘భీమ్లా నాయక్’ బదులు ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ పెద్ద బాంబు పేల్చేశారు. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ కంటే రానా యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పారన్నమాట. ఇకపోతే ఓ PK ఫ్యాన్‌గా బాగా హర్ట్ అయ్యా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను కెలికేలా మరో ట్వీట్ పెట్టారు ఆర్జీవీ. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ చూశాక రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నారని తెలుస్తోందంటూ మంట పెట్టే కామెంట్ చేశారు. అంతటితో ఆగలేదండోయ్.. ఈ ట్రైలర్‌పై తన అభిప్రాయాలన్నీ కుండబద్దలు కొట్టేస్తూ పూర్తి రివ్యూ ఇచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. పవన్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అయితే మాత్రం ఏం లాభం? వర్మకు అవన్నీ లైట్.. అంతేగా! అంతేగా!!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fO3UlBd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....