సీనియర్ నటుడు.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘’. ఫిబ్రవరి 18న మూవీ రిలీజైంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ ముందే విపరీతమైన ట్రోలింగ్‌ను ఫేస్ చేసింది. ట్రోలర్స్ సినిమాను బేస్ చేసుకుని మంచు ఫ్యామిలీని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. సినిమా రిలీజైంది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. చాలా చోట్ల సినిమా షోస్‌ను కూడా క్యాన్సిల్ చేశారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు తొలి రోజున కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల మేరకు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా యూనిట్ నుంచి సన్ ఆఫ్ ఇండియా మూవీ కలెక్షన్స్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. సినిమా బడ్జెట్ పరంగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం రూ.12 కోట్లు మేరకు ఖర్చు అయ్యాయట. ఇక సినిమా తొలి రోజునే ఇంత వీక్ కలెక్షన్స్ రావడం కాస్త సోచనీయం. సినిమా హిట్ కావాలంటే సినిమాకు రూ.20 కోట్లు రావాలి. నేటి రాజకీయ నాయకుల తీరు తెన్నుల గురించి విమర్శనాత్మకంగా.. చాలా చోట్ల ఏకపాత్రాభినయంతో మోహన్ బాబు నటిస్తూ ప్రయోగాత్మకంగా సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని రూపొందించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పోసాని కృష్ణమురళి, సునీల్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. అంతకు ముందు ఆయన సూర్య హీరోగా చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/eCglnID
No comments:
Post a Comment