Monday, 28 February 2022

Official: ప్రభాస్ బిగ్ అప్‌డేట్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఇచ్చేశారండోయ్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అదే ఫామ్‌లో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. 'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. అందులో ఒకటే 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రి కానుకగా ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ ఓం రౌత్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు 3D వర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచబోతున్నట్లు ట్వీట్ పెట్టారు. దీంతో ఈ బిగ్ అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అయింది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్‌‌లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ రిలీజ్‌పై ఆతృత నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ మూవీ విడుదల తేదీ ప్రకటించి హూషారెత్తించారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో గతంలో ఎన్నడూ లేనంత థ్రిల్ ఇచ్చేలా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారట మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/CxMFjkH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....