Monday, 28 February 2022

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య.. సమంత ఎమోషనల్ పోస్ట్

ఉక్రెయిన్‌పై సైనిక చర్యపై స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. ఇదే విషయంపై గత రెండు రోజుల క్రితం రియాక్ట్ అయిన స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సమంత.. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా 'యశోద'లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో నటించేందుకు రెడీ అంటూ అన్ని కోణాల్లో కెరీర్ జర్నీ సాగించాలని ప్లాన్స్ చేసుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xlsjCE6

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...