Saturday 19 February 2022

చిరంజీవి, మోహన్ బాబు మీటింగ్.. దానిపైనే కీలక చర్చ!

టాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా నెలకొంటున్న పరిస్థితులు పలు చర్చలకు దారి తీశాయి. కరోనా కష్ట కాలంలో ఇండస్ట్రీ కష్టాలు మొదలుకొని 'మా' ఎన్నికల రగడ, మొన్నటికి మొన్న ఏపీ టికెట్ రేట్ల అంశం వరకు ప్రతిదీ హాట్ టాపిక్ అయింది. దీంతో ఇండస్ట్రీ పెద్ద ఎవరు? గడ్డు పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకునే వారు ఎవరు? అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో , వెళ్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ ఒకేవేదికపై రాబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితులపై ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు. ఆదివారం రోజు జరగబోతున్న ఈ సమావేశానికి చిరంజీవి, మోహన్ బాబు సహా పలువురు సినీ పెద్దలు హాజరు కాబోతున్నారట. అలాగే ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు చెందిన ప్రతినిధులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబంధించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరై పలు కీలక విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఎట్టకేలకు ఇండస్ట్రీలోని అన్ని విభాగాలు ఒక్కతాటి పైకి వచ్చే ప్రయత్నం చేయడం, ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి సిద్ధం కావడం అనేది సినీ వర్గాల్లో ఒకింత శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఈ మీటింగ్‌లో మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హాజరు కాబోతున్నారట. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం మొదలగు అంశాలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఒకే వేదికపై మరోసారి చిరంజీవి, మోహన్ బాబులు కనిపించనుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6gmcrfu

No comments:

Post a Comment

'We want to be trust marker for the fintech industry'

'So, we would work with our members to ensure that we as an SRO create some sort of due diligence for fintechs.' from rediff Top I...