Sunday, 27 February 2022

గ్యాంగ్ లీడర్ సమంత! ఆమె లేడీ పవన్ కళ్యాణ్ అంటూ సుకుమార్ ఓపెన్

యంగ్ హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. మార్చి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఆదివారం (ఫిబ్రవరి 27) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కీర్తి సురేష్, , ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే వేదికపైకి వచ్చి మైక్ పట్టుకున్న సుకుమార్.. సమంతతో పాటు సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వేదికపై రాగానే యాంకర్ సుమకు థాంక్యూ చెప్పిన సుకుమార్.. టాపిక్ తీసుకొచ్చారు. గ్యాంగ్ లీడర్ సమంత మిస్ ఇక్కడ అంటూ అక్కడున్న కీర్తి సురేష్, రష్మిక మందన, సాయి పల్లవిలతో పాటు సమంతలను తెగ పొగిడేశారు. బ్యూటిఫుల్ బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తున్న హీరోయిన్స్ వీళ్ళు అంటూ కామెంట్ చేశారు. మై శ్రీవల్లి అంటూ అక్కడున్న రష్మిక అభిమానులను ఫిదా చేశారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమెలో మంచి ఆరిస్ట్‌తో పాటు మంచి మనిషి దాగి ఉన్నారని అన్నారు. అంతేకాదు సాయి పల్లవి ఓ లేడీ పవన్ కళ్యాణ్ అంటూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు సుక్కు. ప్రకటనల ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేసే విషయంలో సాయి పల్లవి అందరు ఆర్టిస్టులకు ఆదర్శం అని ఆయన అన్నారు. ఇకపోతే తనకు ఇష్టమైన డైరెక్టర్ కిషోర్ తిరుమల అని చెప్పిన సుక్కు.. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. తాను దేవి శ్రీ ప్రసాద్‌ని బాగా నమ్ముతానని, దేవీ ఈ సినిమా చూసి సూపర్ అని చెప్పారని అన్నారు. శర్వానంద్‌కి తాను పెద్ద అభిమానిని అని సుకుమార్ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hau5zTY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....