Friday, 18 February 2022

NBK 107 లొకేష‌న్‌ నుంచి ఫొటో లీక్... సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య

న‌టిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ శుక్ర‌వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 107వ చిత్ర‌మిది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌కృష్ణ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా లొకేష‌న్ నుంచి ఫొటో ఒక‌టి నెట్టింట లీక్ అయ్యింది. అది కూడా ఏకంగా బాల‌కృష్ణ లుక్. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో బాల‌కృష్ణ క‌నిపించ‌బోతున్నార‌ని లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. అలాగే బాల‌కృష్ణను మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో మెలితిప్పిన మీసాల లుక్‌లో చూడ‌బోతున్నాం. నిజ ఘ‌ట‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాల‌కృష్ణ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. చిత్రీక‌ర‌ణ మొద‌టి రోజునే బాల‌కృష్ణ లుక్ లీక్ కావ‌డం అనేది నిర్మాత‌ల‌ను కాస్త ఇబ్బంది పెట్టే విష‌య‌మే. లీకుల విష‌యంలో మేక‌ర్స్ జాగ్ర‌త్త‌లు పాటిస్తే బావుంటుంది. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మిస్తోంది. అఖండ‌తో గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌కృష్ణ హీరోగా క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా రిషి పంజాబి సినిమాటోగ్రాఫ‌ర్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xQfKA0B

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G