Sunday, 13 February 2022

మాటిస్తున్నా.. కృతి శెట్టి ఎమోషనల్ పోస్ట్ వైరల్

సినిమా అనే రంగుల ప్రపంచంలో లక్ అనేది కొందరికే ఉంటుంది. తొలి సినిమాతోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకునే నటీనటులు కొందరే ఉంటారు. ఆ లిస్టులోనే ఉంది . ఉప్పెన సినిమాతో సినీ గడపతొక్కిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. తనదైన లుక్స్, నటనతో అందరినీ ఆకట్టుకుంది. బేబమ్మ పాత్ర చేసి ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ రాయడం, కృతి బిజీ ఆర్టిస్ట్ కావడం జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది కృతి. తన తొలి సినిమా 'ఉప్పెన' విడుదలై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కృతి శెట్టి భావోద్వేగంతో ఓ సందేశం పోస్ట్ చేసింది. ''జీవితంలో రెండు పుట్టిన రోజులుంటే అందులో ఒకటి మన పుట్టినరోజు. ఇంకొకటి.. మనం జీవితంలో ఏం చేయాలో సెలెక్ట్‌ చేసుకున్న రోజుగా భావిస్తా. సంవత్సరం క్రితం నటిగా ఎంట్రీ ఇచ్చి ఇష్టపడి ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నాను. కాబట్టి ఈ రోజును మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. మీ అందరి ఆదరాభిమానాలు దక్కడం నాకు మరింత సంతోషాన్నిస్తోంది. అదే నన్ను మరో అడుగు ముందుకేసేలా ప్రోత్సహిస్తోంది. ఈ జర్నీని గుర్తుంచుకునేలా చేసిన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు. ఇంకా చాలా కష్టపడి మంచి మంచి పాత్రలో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తున్నా'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది కృతి శెట్టి. రీసెంట్‌గా నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో, ‘బంగార్రాజు’ మూవీలో నాగ చైతన్య సరసన నటించి హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంది కృతి. ప్రస్తుతం రామ్‌ పోతినేని సరసన ‘వారియర్‌’, ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రాలతో బిజీగా ఉంది. నేటితరం హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ దూసుకుపోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Yn3mloV

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....