Saturday, 19 February 2022

ఆడవాళ్ళు మీకు జోహార్లు: భీమ్లా నాయక్ ఎఫెక్ట్‌.. తప్పలేదు మరి..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ హీరో . ఈ క్రమంలోనే క్రేజీ హీరోయిన్ జంటగా '' అనే సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ కాగా సడెన్‌గా 'భీమ్లా నాయక్' అడ్డు పడటంతో వెనక్కి తగ్గారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ వాయిదా పడడంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి బెటర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఓ మోస్తారు హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఈ మూవీ హిట్ శర్వానంద్‌కి చాలా కీలకం కానుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి రోల్స్, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనాల్సిందే అంటున్నారు మేకర్స్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. శర్వా గత సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకే పెద్ద సినిమాతో పోటీ వద్దని భావించి కాస్త దూరం జరిగినట్లున్నారు దర్శకనిర్మాతలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OQDfg4n

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...