Monday, 28 February 2022

Bhola Shankar First Look : ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. మెగాస్టార్ మాస్ మేనియా

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మహా శివ రాత్రి సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొదుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్‌.. అజిత్ హీరోగా చేసిన త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుంది . డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ఫెస్టివ‌ల్ అనే చెప్పాలి. మెగా హీరోల సినిమాలు ఎలాగూ వారి ఫ్యాన్స్‌ను అల‌రిస్తాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాను రిలీజ్‌కి సిద్ధం చేశారు. ఇక సెట్స్ పై భోళా శంక‌ర్‌తో పాటు గాడ్ ఫాద‌ర్‌, డైరెక్ట‌ర్ బాబి చిత్రాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Qx5S8dV

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....