Saturday 12 February 2022

తెలుగు సినీ పరిశ్రమకు అన్న.. ఇండస్ట్రీ పెద్దన్న మోహన్ బాబు.. నరేష్ కామెంట్స్ వైరల్

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో పెద్ద ఎవరు? అనే దానిపై చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. దాసరి నారాయణ రావు మరణం తర్వాత ఆ ప్లేస్ రీ- ప్లేస్ చేసే వ్యక్తి ఎవరు? సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను, అందరినీ కలుపుకుంటూ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను ఎవరు తీసుకోబోతున్నారనే టాపిక్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఓ వైపు చిరంజీవి పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతూనే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే కళామతల్లికి సేవ చేసుకుంటాను తప్ప తనకు మాత్రం ఇండస్ట్రీ పెద్ద అని పిలిపించుకోవడం ఇష్టం లేదని చిరంజీవి అన్నారు. ఈ పరిస్థితుల నడుమ మోహన్ బాబును ఉద్దేశిస్తూ సీనియర్ హీరో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. చాలాకాలం తర్వాత హీరోగా రూపొంది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్ బాబు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేష్. 'తెలుగు సినీ పరిశ్రమకు అన్న. మా అందరికీ అన్న.. అందరికంటే మిన్న' మోహన్ బాబు గారు అంటూ ఆయనపై ప్రశంసలు గుప్పించారు నరేష్. ''నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. మా రెండు కుటుంబాల అనుబంధం ఏనాటిదో. తెలుగులో గొప్ప హీరోలున్నారు. గొప్ప విలన్లున్నారు. గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు. కానీ అన్నీ కలిపి ఒకరున్నారంటే అది మోహన్ బాబు గారు. ఇది చరిత్ర ఉన్నంత కాలం మారదు. ఆయనకు ఆయనే సాటి. ఓ ఫిలిం మేకర్‌గా చెబుతున్నా దేవానంద్‌లో చూసిన ఫిలిం మేకింగ్ పాషన్ మళ్ళీ మోహన్ బాబు లోనే చూశా. లక్ష్మి ప్రసన్న ఆఫీసుకు వెళితే ఆయన అలా సింహాసనం మీద కూర్చొని ఉంటారు. ఎప్పటికీ ఆఫిసులో ఓ కథ సిద్దమవుతూనే ఉంటుంది. కుడి భుజంలా విష్ణు ఉంటారు. పది మందికి అన్నం పెడతారు. సినిమా కోసం బతికే వ్యక్తి కాదు.. సినిమా కోసం పుట్టిన వ్యక్తి మోహన్ బాబు గారు. ఈ విషయం గర్వంగా చెబుతున్నా. ఒక రైతు కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా ఎదిగి ఒక యూనివర్సిటీ స్థాపించగలిగిన ఏకైన నటుడు మోహన్ బాబు ఒక్కరే. అలాంటి వ్యక్తితో మాకు అనుబంధం ఉందని చెప్పుకోవడం నిజంగా గర్వ కారణం. ఒక మాట ఇస్తే దానిపై నిలబడే వ్యక్తి మోహన్ బాబు గారు. విష్ణుతో పాటు సినిమా కోసం నిలబడే కుటుంబం మోహన్ బాబు కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/UBRqz9O

No comments:

Post a Comment

'The EV Market Is Hotting Up'

'A lot of players such as Maruti and Hyundai are entering the market in the first and the second quarters of 2025.' from rediff To...