Thursday, 24 February 2022

చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర.. పవన్‌పై బండ్ల గణేష్

సినిమా అంటే.. హడావిడే ఎక్కువగా ఉంటుంది. బండ్ల గణేష్ స్పీచ్‌లు లేనదే.. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లు జరగవు. బండ్లన్న స్పీచులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బండ్ల గణేష్‌కు, ఆయన మాటల తూటాలకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అతని పొగడ్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ వస్తాడా? లేదా? అని వారం ముందే చర్చలు ప్రారంభించేశారు. అయితే బండ్ల గణేష్ పేరు మీదుగా లీకైన ఆడియో సంచలనంగా మారింది. అందులో త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అర్థమవుతోంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ బండ్లన్న ఖండించాడు. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ కనిపించలేదు. ఆహ్వానం అందలేదేమో.. ఏం జరిగిందో గానీ మొత్తానికి బండ్లన్న రాకపోవడం, ఆయన స్పీచు లేకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో బండ్లన్న ఎక్కడ అంటూ అభిమానులు హంగామా చేసేశారు ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర.. ’ అంటూ భీమ్లా నాయక్ సినిమా మీద బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gfwOCiv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....