కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు. ఈయన హీరోగా నటించిన చిత్రం ‘’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోలింగ్స్‌పై ఘాటుగానే స్పందించారు. ‘‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలే తప్ప, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సాధారణంగా నేను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పట్టించుకోను. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తాను. నిజానికి ట్రోలింగ్‌ను పట్టించుకోకూడదు. కానీ ఇవి హద్దులు మీరుతున్నాయి. అలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయవచ్చునేమో నాకు తెలియదు కానీ.. వ్యగ్యంగా ట్రోల్ చేయడం అనేది బాధాకరంగా ఉంటుంది. ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయడానికనే నియమించుకుని ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు. ఎవరూ సహాయపడరు’’ అన్నారు మోహన్ బాబు. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రైవేట్ జైలు అనే కాన్సెప్ట్‌ను చూపించబోతున్నారు. ఓటీటీ కోసమని ముందు ఈ సినిమాను నిర్మించారు. 1గంట 29 నిమిషాలే ఈ సినిమా వ్యవధి. నిర్మాతగా, థియేటర్స్‌ను ప్రేమించే వ్యక్తిగా మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని థియేటర్స్‌లోనూ విడుదల చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tWr63pz
No comments:
Post a Comment