Monday, 28 February 2022

మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారు.. చాలా ఇబ్బంది పడ్డా! ఓపెన్ అయిన సుప్రిత

షూటింగ్ అన్నాక బోలెడన్ని టేక్స్ ఉండటం కామన్. సీన్ ఏదైనప్పటికీ దర్శకుడికి నచ్చే వరకు ఆ సీన్ షూట్ చేస్తూనే ఉంటారు. అయితే రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాల మాటేంటి అంటారా? అవన్నీ కూడా నటనలో ఓ భాగమే కాబట్టి షూటింగ్‌ విషయంలో దేనికీ మినహాయింపు ఉండదు. కొత్త నటీనటులైతే ఇలాంటి సీన్స్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సీనియర్ నటి సురేఖా వాణి కూతురు విషయంలో కూడా అదే జరిగిందట. ఓ సీన్ కోసం ఆమెతో మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుప్రితనే వెల్లడించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కెమెరా ముందుకు రాకుండానే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది సుప్రిత. నిత్యం ఆన్ లైన్ వేదికపై తన డాన్సులు, ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రమంలోనే తల్లి సురేఖా వాణి బాటలో రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చి అట్రాక్ట్ చేసింది సుప్రిత. కాకపోతే సినిమాల్లో కాకుండా ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించింది. ఇద్దరు ప్రేమికుల మ‌ధ్య ఎమోష‌న్స్‌ తెలియ‌జేసేలా ‘’ అనే పేరుతో ఈ ఆల్బమ్ షూట్ చేసి వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో సుప్రిత ప్రేమికుడిగా ర్యాప్ సింగ‌ర్ రాకీ జోర్దాన్‌ న‌టించారు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రిత షూటింగ్ తాలూకు విశేషాలు పంచుకుంది. ఈ సాంగ్‌లో ముద్దు సీన్ చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది. ఆ టేక్ తనతో మళ్ళీ మళ్ళీ చేయించుకున్నారని, రెండు రోజులు ఆ సీన్ షూట్ చేశారని తెలిపింది. లైఫ్‌లో ఈ హగ్గులు, కిస్సులు ఎప్పుడూ కాలేదు కదా అందుకే చాలా ఇబ్బందిగా అనిపించిందంటూ సుప్రిత చెప్పిన సంగతులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తండ్రి లేని బాధను, జీవితంలో కష్టాలను కూడా ఇదే ఇంటర్వ్యూలో సుప్రిత పంచుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kgsMpWo

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...