Tuesday, 15 February 2022

లవ్ ఎఫైర్‌పై శ్రీముఖి క్లియర్ హింట్! ఓపెన్ అయిన బ్యూటీ

సెలబ్రిటీల లవ్ ఎఫైర్స్, ప్రేమ సంగతులంటే జనంలో అదో క్యూరియాసిటీ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రేమాయణాలు తెలుసుకోవాలని, తెరవెనుక వారి వారి లవ్ ట్రాక్స్ ఎలా నడుస్తున్నాయని నిత్యం సెర్చ్ చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ యాంకర్ పెట్టిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రేమికుల రోజున సడెన్ సర్‌ప్రైజ్ చేసింది శ్రీముఖి. సాధారణంగా ప్రేమికులకు వాలెంటైన్స్ డే అనేది చాలా స్పెషల్. ప్రేమ సంగతులు బయటపెట్టడానికి, నచ్చిన వాళ్లకు బహుమతులు ఇవ్వడానికి ఈ రోజు కోసం వెయిట్ చేస్తుంటుంది ప్రేమ లోకం. అయితే ఇదే రోజు తనకు చాలా స్పెషల్ అంటూ యాంకర్ శ్రీముఖి మనసులో మాట చెప్పి ఆశ్చర్యపర్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా గులాబీ పూలు నింపిన ఫ్లవర్ బొకేతో దిగిన పిక్‌ను షేర్ చేసిన శ్రీముఖి.. 'ఫిబ్రవరి 14, 2022. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. జీవితంలోనే బెస్ట్ వాలెంటైన్స్ డే ఇది' అని పేర్కొంటూ హార్ట్ సింబల్స్, లవ్ సింబల్స్ పంచుకుంది. దీంతో ఈ ఫొటో, శ్రీముఖి పెట్టిన ఆ క్యాప్షన్ జనాల్లో పలు అనుమానాలకు తెరలేపింది. ఈ యంగ్ యాంకర్ ప్రేమలో పడిందని, ఇలా క్లియర్ హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ప్రపోజ్ చేయగానే ఎస్ అనేశారా మేడం?, అక్కా బావెక్కడ, ఇంతకీ అతనెవరు?' అంటూ శ్రీముఖి వెంటపడుతున్నారు నెటిజన్లు. చూడాలి మరి లవ్ ఎఫైర్‌ విషయమై శ్రీముఖి రియాక్షన్ ఎలా ఉంటుందనేది. మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకర్ అవతారమెత్తింది శ్రీముఖి. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'జులాయి' సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించి ఆ తర్వాత ''నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ'' లాంటి సినిమాలతో అలరించింది. ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. మరోవైపు బుల్లితెరపై హవా నడిపిస్తూ పలు కార్యక్రమాలు హోస్ట్ చేస్తోంది శ్రీముఖి. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన పాపులారిటీ రెట్టింపు చేసుకుంది ఈ బుల్లితెర రాములమ్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/zeD1uY7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....