Friday 11 February 2022

Perni Nani : ట్వీటేసి డిలీట్ చేసిన మంచు విష్ణు.. మళ్లీ అడ్డంగా బుక్కైన ‘మా’ ప్రెసిడెంట్

మీద నెట్టింట్లో జరిగే ట్రోలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మా ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయినప్పుడు వచ్చిన ప్రశంసల కంటే జరిగిన ట్రోలింగే ఎక్కువగా ఉంటుంది. మా ఎన్నికల్లో భాగంగా మంచు విష్ణు మాట్లాడిన మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో మాట్లాడిన మాటలు మంచు విష్ణుకు దారుణంగా చెడు చేశాయి. ఇప్పటికే వాటి తాలుకా ట్రోలింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఇక ఏపి ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య జరిగిన కోల్డ్ వార్ మీద కూడా స్పందించలేదు మంచు విష్ణు, టికెట్ రేట్ల అంశంలోనూ రియాక్ట్ అవ్వలేదు. పైగా సీఎం వైఎస్ జగన్ చిరంజీవి భేటీని పర్సనల్ మీటింగ్ అంటూ కౌంటర్ వేశాడు. దానికి పరిశ్రమకు, టికెట్ రేట్లకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడేశాడు. గురువారం నాడు టాలీవుడ్ పెద్దలంతా కూడా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమకు రావాల్సిన, కావాల్సిన వాటిని అడిగారు. వాటిని ఇచ్చేందుకు సీఎం జగన్ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయాన్నీ మీడియా ముఖంగా చిరంజీవి, వంటి వారు చెప్పేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ మీటింగ్‌కు మంచు వారు ఎందుకు దూరంగా ఉన్నారంటూ కొత్త కథనాలు వెలువడ్దాయి. అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటికి నాని వెళ్లాడు. తమ ఇంటికే మంత్రిని పిలిపించుకున్నారు అంటూ అది మోహన్ బాబు రేంజ్ అంటూ కామెంట్లు వచ్చాయి. దీనికి తగ్గట్టుగా మంచు విష్ణు కూడా ఆవేశ పడి ట్వీట్ వేశాడు. టాలీవుడ్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలను మాకు వివరించినందుకు థ్యాంక్స్ అంటూ పేర్ని నాని తన ఇంటికి వచ్చిన విషయాన్ని మంచు ట్వీట్ వేశాడు. అయితే ఆ కాసేపటికే వ్యవహారం అడ్డం తిరిగింది. తానుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లలేదని, వారు కాఫీకి పిలిస్తేనే వెళ్లాను అని, ప్రభుత్వం తరుపున కాదంటూ, ప్రభుత్వం చేసిన చర్చలను వారికి వివరించలేదని అన్నాడు. మీరు ట్వీట్ చేశారా? అని మంచు విష్ణు కూడా తాను అడిగానని, తాను డిలీట్ చేసి కొత్త ట్వీట్ వేశానని మంచు విష్ణు చెప్పాడంటూ పేర్ని నాని మీడియాతో చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆవేశపడి ట్వీట్ వేసిన మంచు విష్ణును నెటిజన్లు ఆడుకుంటున్నారు. ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావ్ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. స్క్రీన్ షాట్లతో నెటిజన్లు ఆడుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/LgWpvdV

No comments:

Post a Comment

'The EV Market Is Hotting Up'

'A lot of players such as Maruti and Hyundai are entering the market in the first and the second quarters of 2025.' from rediff To...