Tuesday, 22 February 2022

Valimai Pre Release Event : రిలీజ్ డేట్ మరిచిపోయిన హీరో.. కార్తికేయ క్షమాపణలు

సినిమాపై తమిళ నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో హీరోగా అజిత్ దుమ్ములేపుతుంటే.. విలన్‌గా నటించాడు. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక నిర్మాత బోనీ కపూర్ అవ్వడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. బైక్ చేజింగ్, రేస్, యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 24న రాబోతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (మంగళవారం ఫిబ్రవరి 22) జరిగింది. ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ.. ఓ తప్పు చేశాడు. సినిమా విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న అని చెప్పాల్సింది. కానీ నవంబర్ 24న అంటూ నోరు జారేశాడు. ఆ తరువాత ఎప్పటికో తన తప్పు తెలుసుకుని.. సరి చేసుకున్నాడు. ఇందాక మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పానట.. నవంబర్ 24 అని చెప్పానట. క్షమించండి అని అన్నాడు. వలిమై సినిమా ఫిబ్రవరి 24న రాబోతోందని సరి చేసుకున్నాడు. ఇందాక ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నాను.. నవంబర్ 24 అంటే అది నా పెళ్లి రిసెప్షన్ రోజు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన స్పీచులో ఇటు పవర్ స్టార్, అటు తలా అభిమానులను కవర్ చేశాడు. ఫిబ్రవరి 24న వలిమై చూడండి.. ఆ తరువాత ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా చూడండని ఇరువురు హీరోల అభిమానులను కోరాడు కార్తికేయ. బాక్సాఫీస్‌కు పట్టిన తుప్పు వదిలించేందుకు ఇలా అజిత్, పవన్ కళ్యాణ్ ఒక్క తేదీ గ్యాప్‌తొ వస్తున్నారు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వలిమై సినిమాతో కార్తికేయ కోలీవుడ్‌లో తన సత్తా చాటబోతోన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9HtMQyz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....