Wednesday, 9 February 2022

Thats Not My Name : సమంతను ఫాలో అవుతున్న మహానటి..ఇదో క్రేజీ ఫీట్

సౌత్ స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా నిరంతరం సోషల్ మీడియాలో సమయం కేటాయిస్తూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో తమ సినిమాలతో పాటు వ్యక్తిగత ఫొటో షూట్స్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను అక్కడ అప్‌డేట్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్స్ చేస్తున్న కొన్ని క్రేజీ ఛాలెంజెస్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొణె, అనుష్క శర్మల తర్వాత సౌత్ దివాస్ కూడా ‘దట్స్ నాట్ మై నేమ్’ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోయిన్ ఇంతకముందు ఈ ఛాలెంజ్‌ను కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇదే లిస్ట్‌లో మరో స్టార్ హీరోయిన్ కూడా వచ్చి చేరారు. ఆమె కెరీర్ ప్రారంభం నుంచి సినిమాలలో పోషించిన పాత్రలను చూపిస్తూ ‘దట్స్ నాట్ మై నేమ్’ పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికలో ఓ ఆహ్లాదకరమైన క్లిప్‌ను అప్‌లోడ్ చేశారు కీర్తి. ఈ రీల్ ఎంతో అద్భుతంగా ఉంది. స్ట్రైప్స్ ఉన్న నైట్‌వేర్‌లో మన మహానటి పోజులివ్వడంతో ఈ రీల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత శైలజ, సావిత్రి, మాయ, కావ్య, సెంబరుతి, అర్చ, అనుపమ..లాంటి పాపులర్ పాత్రలతో కొనసాగుతూ.. ప్రస్తుతం ‘కళావతి అని పిలవడానికి సిద్ధంగా ఉంది’. అని వీడియో పూర్తవుతుంది. ఇది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ కళావతి పాత్ర ఆమె.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్రం లోనిది. ఈ మూవీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా దీనికి పోస్టర్‌ను కూడా మేకర్స్ వదిలారు. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘వేదాళం’ చిత్రానికి తెలుగు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే, నేచురల్ స్టార్ నాని సరసన కూడా కీర్తి ‘దసరా’ అనే చిత్రంలో నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/YEeT1yJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....