Saturday, 19 February 2022

జీవితంలో ఎన్నో వచ్చిపోతుంటాయ్.. కానీ! సమంత ఎమోషనల్ పోస్ట్

అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ అనంతరం ప్రతి క్షణం వార్తల్లో నిలుస్తోంది సమంత. ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్‌డేట్స్ ఇస్తున్నారు న్యూస్ మేకర్స్. ముఖ్యంగా సోషల్ మీడియా వాల్‌పై రాస్తున్న ప్రతి కొటేషన్‌లో అర్థాలు వెతుకుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'లైఫ్ అంటే ఇదే' అని ట్యాగ్ చేస్తూ ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఆన్ లైన్ వేదికలపై తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు సినిమా షూటింగ్స్‌లో భాగమవుతూనే వీలు కుదిరినప్పుడల్లా దేశాన్ని చుట్టివస్తూ అందమైన లొకేషన్స్‌కి వెళ్లి రిలాక్స్ అవుతోంది సమంత. ఈ క్రమంలోనే తాజా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లి అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎగిసిపడుతున్న ఆ జలపాతాలను జీవితంతో పోల్చుతూ సమంత పెట్టిన కొటేషన్ ఆలోచింపజేస్తోంది. వచ్చిపోయేవి ఎన్నో ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడం, భరించడం అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది అని పేర్కొంటూ సింపుల్‌గా 'లైఫ్' అని రాసింది సమంత. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా ఖాతాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సమంత.. తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూనే ఇలా మోటివేషనల్ లైన్స్ షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' మూవీ కంప్లీట్ చేసిన ఆమె, ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే సినిమాలో, ఓ ఇంటర్నేషనల్ వెబ్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది. విడాకుల తర్వాత పూర్తి సమయాన్ని కెరీర్ కోసమే కేటాయిస్తోంది సమంత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mt6yp5H

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....