Worldwide Collections మాస్ మహారాజా క్రాక్ సినిమా హిట్ అవ్వడంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఆ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్ సినిమా పడి ఉంటుంది. అయితే ఖిలాడీ మాత్రం క్రాక్ రేంజ్‌లో ఆకట్టుకోలేదని అర్థమవుతోంది. ఖిలాడి సినిమా ఎటు మొదలై ఎటు ఎండ్ అవుతోంది.. ఆ ట్విస్ట్‌లు ఏంటి.. ఆ గందరగోళం ఏంటని అందరూ కామెంట్లు చేస్తున్నారు. రవితేజ ఎంత బాగా నటించినా అదొక్కటే సరిపోదు కదా? అని అనేస్తున్నారు. మొత్తానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్‌తో ఖిలాడీ థియేటర్ల వద్ద సందడి చేసింది. అయితే ఈ ఖిలాడి సినిమాను అత్యంత భారీ ఎత్తు నిర్మించారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖిలాడి సినిమాను హలీవుడ్ లెవెల్‌లో తెరకెక్కించామని ప్రమోషన్స్‌లో నిర్మాత ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు స్టైలిష్‌గా ఉన్నాయి. అయితే సినిమా మాత్రం అలా అనిపించదు. ఈ సినిమా ఓవరాల్‌గా 23 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అలా మొత్తానికి 23 కోట్లు బిజినెస్ చేసిన ఖిలాడి సినిమా 24 కోట్లతో బ్రేక్ ఈవెన్ మార్క్‌తోొ బరిలోకి దిగింది. మరి ఈ మిక్స్డ్ టాక్‌తో రవితేజ ఎంత రాబడతాడు అనేది అనుమానమే. కానీ మొదటి రోజు మాత్రం లెక్కలు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు ఖిలాడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదారు కోట్లు రాబట్టేలా ఉందని. అదే మిగతా అన్ని చోట్లను పరిగణలోకి తీసుకుంటే ఈ చిత్రం మొదటి రోజు ఆరేడు కోట్లను కొల్లగొడుతుందని అర్థమవుతోంది. ఈ వీకెండ్‌ను ఇలానే వినిగియోగించుకుంటే త్వరలోనే ఖిలాడి బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉంటుంది. మరి అధికారిక లెక్కలను మేకర్లు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/sd7GfyO
No comments:
Post a Comment