Saturday, 19 February 2022

NBK 107 Leaked Pic : NBK 107 టీంకు తలనొప్పిగా మారిన లీకులు.. దండం పెట్టిన దర్శకుడు

నటసింహం 107వ సినిమాను అదిరిపోయే కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతోన్నాడు. మాస్ జాతర మరోసారి చూపించేందుకు గోపీచంద్ రెడీ అయినట్టు కనిపిస్తోంది. అసలే ఈ హీరో,దర్శకులు ఇద్దరూ కూడా మంచి హిట్లతో ఊపు మీదున్నాడు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు గోపీచంద్ మలినేని. ఇక బాలయ్య అయితే అఖండ సినిమాతో మాస్ జాతరను చూపించాడు. థియేటర్లో బాలయ్య దెబ్బకు బాక్సులు బద్దలయ్యాయి. బాలయ్యతో మాస్ సినిమాను చూసేందుకు గోపీచంద్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ వచ్చాడు. మొత్తానికి తన కలను నెరవేర్చుకున్నాడు. బాలయ్య సినిమా షూటింగ్‌ను ప్రారంభించడంపై గోపీచంద్ ఎమోషనల్ అయ్యాడు. కలలు నిజమవుతాయని అంటారు.. ఇప్పుడు ఈరోజు నా కల నెరవేరిందంటూ నిన్న గోపీచంద్ ట్వీట్ వేశాడు. బాలయ్యను ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించే బాధ్యత నాది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్‌లతో కలిసి యాక్షన్ పార్ట్‌ను గోపీచంద్ మొదలుపెట్టేశాడు. అయితే నిన్నటి షూటింగ్‌లో బాలయ్య అడుగు పెట్టనట్టు కనిపిస్తోంది. కానీ నేడు బాలయ్య సెట్‌లోకి అడుగుపెట్టేశాడు. అయితే మొదటి రోజే టీంకు షాక్ తగిలింది. బాలయ్య లుక్ బయటకు వచ్చింది. లీకైన ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బాలయ్య లుక్కుని చూసి జనాలు అవాక్కవుతున్నారు. లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మొత్తానికి ఈ విషయం చిత్రయూనిట్ దృష్టికి వచ్చినట్టుంది. రంగంలోకి దర్శకుడు గోపీచంద్ దిగాడు. ఈ లీకులను ఆపండని వేడుకున్నాడు. ఎవ్వరూ కూడా ఈ లీకైన ఫోటోలు, వీడియోలను స్ప్రెడ్ చేయకండి.. ఇది నా రిక్వెస్ట్.. అంటూ దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. కానీ ఇప్పటికే ఆ ఫోటోలు అందరి వద్దకు చేరిపోయినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ తాను వేసిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశాడు. మరి దీని వెనుకున్న కారణం ఏంటో తెలియడం లేదు. ఇంకా ఇలా వేడుకుంటే మరింతగా స్ప్రెడ్ చేస్తారని భావించాడో లేక నిర్మాణ సంస్థ, హీరో నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చి ఉంటాయో తెలియడం లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xw4AFdH

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW