Wednesday, 2 February 2022

హద్దులు దాటిన మాటలు!.. హీరోయిన్‌కి భీమ్లా నాయక్ నిర్మాత క్షమాపణలు

సినిమా ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌లో హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. కాస్త హద్దులు దాటి ఓ మీడియా ప్రతినిధి ఆ చెత్త ప్రశ్నను సంధించాడు. ట్రైలర్‌లో ఓ రొమాంటిక్ సీన్, డైలాగ్ ఉంది. హీరో హీరోయిన్లు పుట్టుమచ్చల గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎన్ని పుట్టుమచ్చలున్నాయని హీరో అడిగితే.. పదహారు అని హీరోయిన్ చెబుతుంది. ఇక ట్రైలర్‌లో ఉన్న విషయాన్ని నేరుగా హీరోనే అడిగేశాడు సదరు రిపోర్టర్. సినిమాలో డైలాగ్ చెప్పారు కదా? నిజంగానే ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా? అంటూ అడిగేశాడు. ఈ ప్రశ్నకు హీరో కాస్త ఇబ్బంది పడ్డట్టున్నాడు. ఇది అవాయిడ్ చేసేద్దామని హీరో సిద్దు అనేస్తాడు. అయితే క్షణంలో ఈ వీడియో వైరల్ కాసాగింది. నెటిజన్లు ఆ ప్రశ్నను అడిగిన తీరు, ఆ ప్రశ్నను వేయడంపై మండి పడ్డారు. అయితే హీరోయిన్ ఈ ఘటన మీద స్పందించింది. ట్రైలర్ ఈవెంట్‌లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాాలా దురదృష్టకరం.. దీన్ని బట్టి అతను తన చుట్టూ ఉండే మహిళలు, ఇంట్లోని వారిని ఎలా గౌరవిస్తున్నాడో అర్థమవుతోందంటూ చురకలు అంటించింది. అయితే హీరోయిన్‌కు కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగవంశీ స్పందించాడు. క్షమించండి.. ఇది చాలా దురదృష్టకరమే అని అన్నాడు. అయితే నిర్మాత నాగవంశీ కూడా తక్కువేమీ తినలేదు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు నాటుగానే సమాధానం చెప్పాడు. డీజే టిల్లు మీ బయోగ్రఫీనా? అని అడిగితే. కాదండి.. అయినా ఇంత మంచి హీరోయిన్‌తో ముద్దు అంటే నటించడానికి నాకు ఓకే అని కాస్త రొమాంటిక్‌గా ఆన్సర్ ఇచ్చాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/iFITE97qs

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....